Miheeka Daggubati : బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న రానా భార్య.. వీడియో చూశారా..?

Miheeka Daggubati : బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న రానా భార్య.. వీడియో చూశారా..?

Hero Rana Daggubati wife Miheeka enjoying on the beach video goes viral

Updated On : October 27, 2024 / 11:11 AM IST

Miheeka Daggubati : టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి గురించి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో హీరోగా విలన్ గా నటించి భారీ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక 2020లో మిహీకా అనే అమ్మాయిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కరోనా సమయంలో అతి తక్కువ మంది కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహం జరిగింది. రానా భార్య మిహీక నార్త్ ఇండియన్ అమ్మాయి.

Also Read : VenkyAnil3 : వెంకీ-అనిల్ రావిపూడి సినిమా నుంచి సూప‌ర్ అప్‌డేట్.. టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ ఎప్పుడంటే?

అయితే ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఇందులో తనకి సంబందించిన అన్ని విషయాలను షేర్ చేసుకుంటుంది. తాజాగా మిహీక తన ఇన్ స్టా లో ఓ వీడియో షేర్ చేసింది. ఇక ఆ వీడియో లో ఓ బీచ్ లో నడుచుకుంటూ, డాగ్స్ తో సరదాగా ఎంజాయ్ చేస్తుంది ఈ భామ. అందమైన పూల చెట్ల మధ్య అలా రిలాక్స్ అవుతూ కనిపించింది. అంతేకాదు ఆ వీడియో కింద ఓ క్యాప్షన్ కూడా జోడించింది.

 

View this post on Instagram

 

A post shared by Miheeka Daggubati (@miheeka)


అందులో.. సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు ఎలా ఉందో చెప్పింది. మెత్తటి ఇసుక నా పాదాలకు ఊయలగా ఉంది, గాలి నా జుట్టులో నాట్యం చేస్తుంది, అంతులేని సముద్రం నా ముందు ఉంది, పైన ఉన్న ఒక అద్భుతమైన నక్షత్రం నా కోసమే ప్రకాశిస్తున్నట్లు అనిపిస్తుంది. దూరంగా కుటీర లైట్లు తుమ్మెదల్లా మెరుస్తున్నాయి. రాత్రి జారిపోతున్నప్పుడు, ఉదయం వెచ్చటి బ్లష్ లా చంద్రుని చల్లని లాలన మసకబారుతుంది.వెండి చంద్రుడు బంగారు సూర్యుడికి నమస్కరిస్తాడు, అడవి గాలులు వారి సందేశాన్ని గుసగుసలాడుతూ సున్నితమైన గాలిలో ఉంచేస్తాయి అంటూ తెలిపింది. దీంతో మిహీక పోస్ట్ వైరల్ అవుతుంది.