Tiger Nageswara Rao: టైగర్ కోసం రేణుదేశాయ్.. మాస్ రాజాకి సోదరి?

మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో ఇప్పుడు జెట్ స్పీడ్‌తో సినిమాలు చేస్తున్నాడు. ‘ఖిలాడి’ కంప్లీట్ చేసి, ‘రామారావ్ – ఆన్ డ్యూటీ’ తో పాటు త్రినాధరావు..

Tiger Nageswara Rao: టైగర్ కోసం రేణుదేశాయ్.. మాస్ రాజాకి సోదరి?

Tiger Nageswara Rao

Updated On : January 29, 2022 / 6:22 PM IST

Tiger Nageswara Rao: మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో ఇప్పుడు జెట్ స్పీడ్‌తో సినిమాలు చేస్తున్నాడు. ‘ఖిలాడి’ కంప్లీట్ చేసి, ‘రామారావ్ – ఆన్ డ్యూటీ’ తో పాటు త్రినాధరావు నక్కినతో ‘ధమాకా’ చేస్తున్నారు. సుధీర్ వర్మతో 70వ సినిమా అనౌన్స్ చేస్తూనే.. 71వ సినిమా కూడా ప్రకటించేశారు. ‘దొంగాట’ ఫేమ్ వంశీకృష్ణ ఆకెళ్ల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.

Telugu Dubbing Movies: నేషనల్ వైడ్ తెలుగు సినిమా డబ్బింగ్ మేళా

స్టూవర్టుపురంలో పేరుమోసిన గజదొంగ అయిన ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్ ఇది. రవితేజ కెరీర్ లోనే తొలిసారి పాన్ ఇండియా లెవల్లో చేస్తున్న సినిమా ఇదే. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాను రూపొందిస్తున్నారు. కాగా.. ఈ సినిమా అప్డేట్ ఒకటి ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ నటిస్తుందట.

Prabhas: పాన్ వరల్డ్ రేంజ్.. ప్రభాస్ ఇకపై పాన్ ఇండియాస్టార్ కాదు!

‘జానీ’ సినిమా తర్వాత నటనకు దూరంగా ఉన్న రేణు.. ఆ మధ్య ‘ఆద్య’ అనే పవర్ ఫుల్ లేడి ఓరియెంటెడ్ వెబ్ సిరీస్ తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి మళ్ళీ కెమెరా ముందుకు వచ్చారు. టైగర్ కోసం దర్శక,నిర్మాతలు రేణును సంప్రదించగా ఆమె నుండి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదని తెలుస్తుంది. ఆమె ఒకే చెప్తే ఇందులో రవితేజ సోదరిగా రేణు దేశాయ్ కనిపించనున్నట్లు తెలుస్తుంది. మరి రేణూ ఒకే అంటారా లేదా అన్నది చూడాలి.