Saaree : ఆర్జీవీ ‘శారీ’ మూవీ రివ్యూ.. ఆరాధ్య అందాలతో సైకో థ్రిల్లర్.. మంచి కాన్సెప్ట్ కానీ..
కథ పరంగా తీసుకుంటే మంచి కాన్సెప్ట్.

RGV Aaradhya Devi Saaree Movie Review and Rating
Saaree Movie Review : సత్య యదు, ఆరాధ్య దేవి మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా ‘శారీ’. ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై రవిశంకర్ వర్మ నిర్మాణంలో ఆర్జీవీ కథ రాయగా గిరి కృష్ణ కమల్ దర్శకత్వంలో శారీ సినిమా తెరకెక్కింది. శారీ సినిమా నేడు ఏప్రిల్ 4న తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషలలో రిలీజయింది.
కథ విషయానికొస్తే.. కిట్టు(సత్య యదు) ఓ ఫోటోగ్రాఫర్. ఓ రోజు పార్క్ లో ఫోటోలు తీస్తుంటే చీరలో ఆరాధ్య దేవి(ఆరాధ్య దేవి) కనిపిస్తుంది. చీరలో ఆరాధ్యని చూడగానే కిట్టుకి నచ్చేస్తుంది. దీంతో ఆమెని ఫాలో అవుతూ, ఫోటోలు తీస్తూ ఉంటాడు. సోషల్ మీడియాలో ఆమె అకౌంట్ కనుక్కొని తను ఒక ఫోటోగ్రాఫర్ అని, మీతో ఫోటోషూట్ చేయాలనుకుంటున్నాను అని చెప్తాడు. ఆరాధ్య సోషల్ మీడియాలో రీల్స్, ఫోటోలు పెడుతూ ఉంటుంది కాబట్టి ఓకే చెప్తుంది.
ఆరాధ్య – కిట్టు కలిసి ఫోటోషూట్ చేస్తారు. దాని కోసం కొన్ని రోజులు ట్రావెల్ చేస్తారు. ఈ క్రమంలో ఆరాధ్య అన్నయ్య రాజ్ (సాహిల్) కిట్టు ఆరాధ్యతో మిస్ బిహేవ్ చేస్తున్నాడని కొడతాడు. ఫోటోషూట్ అయిపోయాక ఆరాధ్య కిట్టుని దూరం పెడుతుంది. అప్పటికే కిట్టు ఆరాధ్య నా సొంతం అని ఫీల్ అవ్వడంతో ఆమెని ఫాలో అవుతూ ఉంటాడు. తన అన్న వల్లే ఆరాధ్య తనని లవ్ చేయట్లేదేమో అని కిట్టునే ఊహించుకొని మనం ప్రేమించుకుందాం, మీ అన్నయ్యని చంపేస్తాను అని ఆరాధ్యని భయపెడతాడు. పోలీస్ లకు కంప్లైంట్ ఇచ్చినా, ఆరాధ్య అన్న కొట్టినా కిట్టు ఇంకా సైకోగా మారి ఆరాధ్యని కిడ్నాప్ చేస్తాడు. ఆరాధ్య ని కిడ్నాప్ చేసి కిట్టు ఏం చేస్తాడు? కిట్టు రాజ్ ని చంపాడా? కిట్టు సైకోగా ఎలా మారాడు? ఆరాధ్య కిట్టు ప్రేమోన్మాదం నుంచి ఎలా బయటపడింది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : 28°C Movie Review : ’28°C’ మూవీ రివ్యూ.. లవ్ థ్రిల్లర్.. పొలిమేర డైరెక్టర్ ఫస్ట్ సినిమా ఎలా ఉందంటే..?
సినిమా విశ్లేషణ.. ఆర్జీవీ మంచి సినిమాలు తీసి చాలా కాలం అయిపోయింది. ఈ శారీ సినిమా కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ మలయాళీ అమ్మాయిని తీసుకొచ్చి ఆమెతో సినిమాని తీస్తాను అని ప్రకటించి తీసింది. కథ పరంగా తీసుకుంటే మంచి కాన్సెప్ట్. ఇటీవల సోషల్ మీడియాలో అమ్మాయిలు ఎలా ఉంటున్నారు, కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలని ప్రేమ పేరుతో ట్రాప్ చేయడం, అమ్మాయి నో చెప్తే సైకోలా మారిపోవడం అనే ఓ సోషల్ మెసేజ్ ని చెప్పడానికి ప్రయత్నించారు. మంచి కాన్సెప్ట్ తీసుకున్నా దాన్ని ఆర్జీవీ పాత స్టైల్ లో తెరకెక్కించడంతో ఫెయిల్ అయింది.
ఫస్ట్ హాఫ్ లో కిట్టుకి ఆరాధ్య కనపడటం, ఆమెని ఫాలో అయి ఫోటోషూట్ కి ఒప్పించడం, కిట్టు – ఆరాధ్య అన్నయ్య గొడవ, వాళ్ళ అన్నయ్యని చంపేస్తామని బెదిరించడంతో సింపుల్ గానే ఇంటర్వెల్ ఇస్తారు. సెకండ్ హాఫ్ లో ఆరాధ్యని కిడ్నాప్ చేసి కిట్టు తన సైకోతనం ఎలా చూపించాడు అని బాగా సాగదీసారు. సినిమా అంతా స్లో నేరేషన్ తో ఓ చిన్న పాయింట్ ని బాగా సాగదీశారు. కిట్టు చూపించే సైకోయిజం మరీ ఎక్కువగా అనిపిస్తుంది. ఆరాధ్య అందాల ఆరబోతకు కొదవలేదు. చాలా చోట్ల కచ్చితంగా బోర్ కొడుతుంది. ఆర్జీవీ ఇప్పటి సినిమాలకు, టెక్నాలజీకి మారకుండా ఇంకా అదే పాత సినిమాల స్టైల్ ఫాలో అవుతున్నాడని ఈ సినిమాతో మరోసారి చూపించాడు. టైటిల్ జస్టిఫికేషన్ మాత్రం పర్ఫెక్ట్ గా ఇచ్చాడు ఆర్జీవీ. మరి ఆర్జీవీ సినిమాలో ఈ రేంజ్ అందాల ఆరబోత చేసిన ఆరాధ్యకి నెక్స్ట్ సినిమాల అవకాశాలు వస్తాయా లేదా చూడాలి.
నటీనటుల పర్ఫార్మెన్స్.. సోషల్ మీడియాలో చీరకట్టుతో రీల్స్ చేసి బాగా పాపులర్ అయి ఆర్జీవీ కంట్లో పడి ఈ సినిమాతో హీరోయిన్ అయిపోయింది ఆరాధ్య దేవి. మొదటి సినిమాలోనే ఓ రేంజ్ లో అందాలు ఆరబోసింది. నటన పరంగా మొదటి సినిమా అయినా పర్వాలేదనిపించింది. సత్య యదు మాత్రం కిట్టు పాత్రలో ప్రేమ పేరుతో సైకోయిజం చూపించడంలో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. సాహిల్, రూపాలక్ష్మి, అప్పాజీ అంబరీష.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
సాంకేతిక అంశాలు.. ఆర్జీవీ సినిమాలు అంటే సినిమాటిక్ షాట్స్, సినిమాటోగ్రఫీ విజువల్స్ గురించి కచ్చితంగా మాట్లాడుకుంటారు. ఈ సినిమాలో కూడా సినిమాటోగ్రఫీ మాత్రం బాగుంది. శారీ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా మైనస్. అప్పుడెప్పుడో కొన్ని హిట్స్ కొట్టిన శశి ప్రీతమ్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకొచ్చి హెవీ సౌండ్స్ తో అస్సలు సూటవ్వని మ్యూజిక్ ఇప్పించారు. పాటలు మాత్రం పాత సినిమాల స్టైల్ లో పర్వాలేదనిపిస్తాయి. మంచి కథే అయినా రెగ్యులర్ కథాంశంతో బాగా సాగదీశారు. డైరెక్టర్ గిరి కృష్ణ కూడా ఆర్జీవీ ఆధ్వర్యంలో ఆయన రొటీన్ మార్క్ కనపడేలా సినిమా తీసాడు. నిర్మాణ పరంగా బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ‘శారీ’ సినిమా ఓ అమ్మాయిని చీరలో చూసి ప్రేమ అంటూ వెంటపడి సైకోగా మారిన ఓ అబ్బాయి ఏం చేసాడు అని సైకో థ్రిల్లర్ గా చూపించారు. ఈ సినిమాకు 2 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.