LYF – Love Your Father : ‘లైఫ్ – లవ్ యువర్ ఫాదర్’ మూవీ రివ్యూ.. తండ్రి కొడుకుల అనుబంధంతో డివోషనల్ టచ్ ఇచ్చి..

LYF - లవ్ యువర్ ఫాదర్ సినిమా నేడు ఏప్రిల్ 4న థియేటర్స్ లో రిలీజయింది.

LYF – Love Your Father : ‘లైఫ్ – లవ్ యువర్ ఫాదర్’ మూవీ రివ్యూ.. తండ్రి కొడుకుల అనుబంధంతో డివోషనల్ టచ్ ఇచ్చి..

Sri Harsha SP Charan LYF Love Your Father Movie Review and Rating

Updated On : April 4, 2025 / 3:22 PM IST

LYF – Love Your Father Movie Review : మనీషా ఆర్ట్స్ & మీడియా ప్రైవేట్ లిమిటెడ్, అన్నపరెడ్డి స్టూడియోస్ బ్యానర్స్ పై కిషోర్ రాటి, మహేష్ రాటి, ఏ రామస్వామి రెడ్డి నిర్మాణంలో పవన్ కేతరాజు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘LYF – లవ్ యువర్ ఫాదర్’. శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా ఎస్పీ చరణ్, ప్రవీణ్, నవాబ్ షా, రియా కపూర్.. పలువురు ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. LYF – లవ్ యువర్ ఫాదర్ సినిమా నేడు ఏప్రిల్ 4న థియేటర్స్ లో రిలీజయింది.

కథ విషయానికొస్తే.. కిషోర్(SP చరణ్) – సిద్ధూ(శ్రీహర్ష) చాలా క్లోజ్ గా ఉండే తండ్రీకొడుకులు. సిద్ధూ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతుంటాడు. కాలేజీలో ఎవరికీ తెలియకుండా సిద్ధూ తన ఫ్రెండ్ స్వీటీ(కషిక కపూర్) ప్రేమలో ఉంటారు. తన ఫ్రెండ్ మేఘన కూడా సిద్ధూకి ప్రపోజ్ చేస్తుంది. కిషోర్ ఓ సూపర్ మార్కెట్ నడిపిస్తూ అనాథ శవాలకు దహనం చేస్తూ ఓ ఫౌండేషన్ నడిపిస్తూ ఉంటాడు. కిషోర్ తమ్ముడు(ప్రవీణ్)కి గుర్రాల రేసింగ్ మీద బెట్టింగ్ ఆడే అలవాటు ఉండటంతో అప్పుడప్పుడు కిషోర్ ని కూడా తీసుకెళ్తాడు. ఓ రోజు ఎప్పుడూ గెలుపుకు అలవాటు పడిన కబీర్(నవాబ్ షా) ఓడిపోతాడు. ఆ బెట్టింగ్ లో కిషోర్ గెలుస్తాడు.

కిషోర్ కబీర్ కి గెలుపు గురించి సూక్తులు చెప్పడం, మరో కేసులో కబీర్ కి వ్యతిరేకంగా కిషోర్ కంప్లైంట్ చేయడంతో కిషోర్ పై తప్పుడు కేసులు పెట్టించి అరెస్ట్ చేయిస్తాడు కబీర్. సిద్ధూపై కూడా కేసులు పెడతారు. అదే సమయంలో సిద్ధూ ఇంటర్వ్యూ కోసం బెంగుళూరు వెళ్తాడు. కిషోర్ ని ఎందుకు అరెస్ట్ చేసారు? కిషోర్ ని కబీర్ ఏం చేస్తాడు? సిద్ధూ తన తండ్రిపై పడ్డ నిందలను ఎలా పోగొడతాడు? స్వీటీ, మేఘనలలో సిద్ధూ ఎవర్ని లవ్ చేస్తాడు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Buchibabu Sana : ద‌ర్శ‌కుడు బుచ్చిబాబుకు రామ్‌చ‌ర‌ణ్ దంప‌తుల గిఫ్ట్..

సినిమా విశ్లేషణ.. ఫస్ట్ హాఫ్ సిద్ధూ కాలేజీ స్టోరీ, లవ్ స్టోరీ, కిషోర్ మంచితనం, తండ్రీకొడుకుల అనుబంధంతో సాగుతుంది. ఇంటర్వెల్ కి కిషోర్, సిద్ధులపై కేసులు పెట్టి వారిపై విలన్ మనుషులు, పోలీసుల అటాక్ తో ఇంటర్వెల్ కాస్త ఇంట్రెస్ట్ గానే ఇస్తారు. సెకండ్ హాఫ్ లో కథ కాశీకి తీసుకెళ్లి శివుడి ఎలిమెంట్, ఓ ట్విస్ట్ ఇచ్చి కబీర్ ని సిద్ధూ ఏం చేస్తాడు అని సాగుతుంది.

ఫస్ట్ హాఫ్ కాలేజీ సీన్స్ కాస్త సాగదీసినట్టు ఉంటుంది. కాలేజీలో ఫ్రెండ్స్ తో కామెడీ ట్రై చేసినా అంతగా వర్కౌట్ అవ్వలేదు. ప్రీ ఇంటర్వెల్ నుంచి సినిమా ఆసక్తిగా మారుతుంది. ఇంటర్వెల్ కి కథ కాశీకి షిఫ్ట్ అవ్వడంతో నెక్స్ట్ ఏం జరుగుతుందని ఆసక్తి నెలకొంటుంది. సెకండ్ హాఫ్ మొదట్లో వచ్చే ట్విస్ట్ మాత్రం ఎవరూ ఊహించలేరు. ఆ ట్విస్ట్ తో తండ్రి కొడుకులు రివెంజ్ ఎలా తీర్చుకుంటారు అని సినిమా ఇంకా ఆసక్తిగా మారుతుంది. కానీ సీరియస్ కథ సాగుతున్నప్పుడు సెకండ్ హాఫ్ లో షకలక శంకర్ కామెడీతో ఇరిటేషన్ తెప్పిస్తారు. ఈ మధ్యలో శివుడి కాన్సెప్ట్ తీసుకొచ్చి కాస్త డివోషనల్ టచ్ ఇచ్చారు. క్లైమాక్స్ లో మరో ట్విస్ట్ ఇస్తారు.

Lyf Review

నటీనటుల పర్ఫార్మెన్స్.. SP బాలసుబ్రమణ్యం తనయుడు SP చరణ్ నటుడిగా చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి సాఫ్ట్ పాత్రలో బాగానే మెప్పించారు. హీరో శ్రీహర్ష మొదటి సినిమా అయినా బాగానే మెప్పించాడు. కషిక కపూర్, రియా కపూర్ పాత్రలకు పెద్ద స్కోప్ లేదు. విలన్ గా నవాబ్ షా నెగిటివ్ పాత్రలో బాగానే సూట్ అయ్యాడు. ప్రవీణ్ హీరో బాబాయ్ పాత్రలో బాగా నటించాడు. భద్రం, రఘుబాబు.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.

Also See : Sree Vishnu : ‘#సింగిల్‌’ ఫస్ట్‌ సాంగ్‌.. ‘శిల్పి ఎవరో.. ఈ శిల్పమెనుక..’

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగానే ఉన్నాయి. పాటలు పర్వాలేదనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ డివోషనల్ ఎలివేషన్స్ లో బాగా ఇచ్చారు. మంచి కథని కాస్త కొత్త కథనంతో డివోషనల్ టచ్ ఇచ్చి తెరకెక్కించడంలో బాగానే సక్సెస్ అయ్యాడు దర్శకుడు. నిర్మాణ పరంగా సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘లైఫ్ – లవ్ యువర్ ఫాదర్’ సినిమా తండ్రి కొడుకుల అనుబంధానికి కాస్త డివోషనల్ టచ్ ఇచ్చి ఆసక్తిగా చూపించడానికి ప్రయత్నించారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.