RGV : నేను డైరెక్ట్ చేయకపోయినా ఆర్జీవీ చిత్రం అని ఎందుకు వేస్తానంటే…

ఇటీవల వచ్చే ఆర్జీవీ సినిమాలన్నీ ఆయన డైరెక్షన్ చేసినవి కాదు. వేరే డైరెక్టర్ ఆ సినిమాని డైరెక్ట్ చేస్తాడు. డైరెక్టర్ గా వాళ్ళ పేరే ఉంటుంది. కానీ మళ్ళీ ఆర్జీవీ సినిమా అని..........

RGV : నేను డైరెక్ట్ చేయకపోయినా ఆర్జీవీ చిత్రం అని ఎందుకు వేస్తానంటే…

Rgv

Updated On : December 30, 2021 / 10:10 AM IST

RGV :    సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ హిట్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస చిత్రాలు తీస్తాడు. అయితే అన్ని సినిమాలకి ఆర్జీవీ సినిమా అని వేసుకుంటాడు. అయితే ఇటీవల వచ్చే ఆర్జీవీ సినిమాలన్నీ ఆయన డైరెక్షన్ చేసినవి కాదు. వేరే డైరెక్టర్ ఆ సినిమాని డైరెక్ట్ చేస్తాడు. డైరెక్టర్ గా వాళ్ళ పేరే ఉంటుంది. కానీ మళ్ళీ ఆర్జీవీ సినిమా అని కూడా ఉంటుంది. ఆర్జీవీ నుంచి రాబోతున్న మరో సినిమా ‘ఆశ ఎంకౌంటర్’ రేపు రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమా విడుదల సందర్భంగా ఆర్జీవీ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.

Roja : ఏపీ సినిమా టికెట్ వ్యవహారంపై వ్యాఖ్యలు చేసిన రోజా

ఆర్జీవీ ఈ విషయం పై మాట్లాడుతూ.. ‘‘ఓ కథ గురించి ఆలోచించి, నాకున్న అనుభవంతో దాన్ని సినిమాగా ఎలా మలిస్తే బాగుంటుందో ఆలోచిస్తాను. ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్‌ను ఓ దర్శకుడి చేతుల్లో పెడతా. అందుకే ఆ సినిమాని ఎవరు తెరకెక్కించినా అందులో నా భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి ‘ఆర్జీవీ చిత్రం’ అని వేసుకుంటాను. అదీ కాకుండా కొత్త వాళ్ళ పేరు కంటే కూడా ఆర్జీవీ పేరు ఉంటే సినిమా ప్రమోషన్ కూడా బాగా అవుతుంది. ఇప్పుడు ఈ ‘ఆశ’ చిత్రం విషయానికే వస్తే ఈ కథ విషయమై చాలా మంది పోలీస్‌ అధికారులతో నేను స్వయంగా మాట్లాడాను. దీనిపై చాలా రీసెర్చ్‌ చేశాను. నేను కలెక్ట్ చేసిన సమాచారాన్నంతా సినిమా రూపంలో ఈ సినిమా దర్శకుడికి చెప్పి అతనితో తెరకెక్కించాను” అని అన్నారు.