RGV : ఆర్జీవీ దీపావళి సెలబ్రేషన్స్.. నేను కోతిని అంటూ.. టపాసులు ఎలా కాల్చాడో చూడండి..

అసలు పండగలకు, పబ్బాలకు దూరంగా ఉండే ఆర్జీవీ(RGV) నిన్న దీపావళిని(Diwali) సెలబ్రేట్ చేసుకున్నాడు.

RGV Celebrated Diwali Videos Goes Viral

Ram Gopal Varma : దేశమంతా నిన్న గ్రాండ్ గా దీపావళి సెలబ్రేషన్స్ చేసుకుంది. మన సెలబ్రిటీలు కూడా దీపావళిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. కొంతమంది స్టార్లు దీపావళి సెలెబ్రేట్ చేసుకున్న ఫోటోలు షేర్ చేయగా, మరి కొంతమంది పండగ నాడు బాగా రెడీ అయి ఫోటోలు షేర్ చేశారు. ఇక ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండే డైరెక్టర్ ఆర్జీవీ కూడా దీపావళి సెలెబ్రేట్ చేసుకోవడం విశేషం.

అసలు పండగలకు, పబ్బాలకు దూరంగా ఉండే ఆర్జీవీ(RGV) నిన్న దీపావళిని(Diwali) సెలబ్రేట్ చేసుకున్నాడు. రకరకాల క్రాకర్స్ తీసుకొచ్చి వాటిని కాల్చాడు. గాలిలో పేలే క్రాకర్స్ ని వరుసగా పెట్టి ఒకదాని తర్వాత ఒకటి కాలుస్తూ ఫుల్ ఎంజాయ్ చేసాడు ఆర్జీవీ. అలాగే మరో క్రాకర్స్ ఒకటి పేలుతుంటూనే దానిపై ఇంకో బాక్స్ పెట్టి రచ్చ చేశాడు. ఆర్జీవీ తన దీపావళి సెలెబ్రేషన్స్ వీడియోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసి.. నేను కోతిని, మాములుగా చేసేవి మనకు నచ్చవుగా అంటూ పోస్ట్ పెట్టాడు. దీంతో ఆర్జీవీ దీపావళి సెలెబ్రేషన్స్ వీడియోలు వైరల్ గా మారాయి.

Also Read : Diwali 2023 : సెలబ్రిటీల దీపావళి సెలబ్రేషన్స్.. మతాబుల్లా వెలిగిపోతున్న మన స్టార్లు..

ఆర్జీవీ కూడా దీపావళి సెలెబ్రేట్ చేసుకుంటాడా, జాగ్రత్తగా కాల్చు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారుగా ఆర్జీవీ.. అంటూ అభిమానులు, నెటిజన్లు ఆర్జీవీ వీడియోలకు కామెంట్స్ పెడుతున్నారు.