Ram Gopal Varma: యుద్ధం – శాంతి.. భార్యాభర్తల లాంటివి: ఆర్జీవీ ట్వీట్
ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. రష్యా - యుక్రెయిన్ యుద్ధంపై స్పందించారు. యుద్ధం మరియు శాంతి భార్యాభర్తల లాంటివి" అంటూ రాసుకొచ్చారు

Rgv
Ram Gopal Varma: ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. రష్యా – యుక్రెయిన్ యుద్ధంపై స్పందించారు. సమకాలీన అంశాలపై తనదైన శైలిలో స్పందించే రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు ఈ యుద్ధంపైనా అదే విధంగా స్పందించారు. ఆదివారం ఆర్జీవీ చేసిన ట్వీట్ లో “శాంతిని పునరుద్ధరించడానికి ఏకైక మార్గం యుద్ధం చేయడం మరియు యుద్ధం యొక్క ఏకైక లక్ష్యం శాంతిని కాపాడుకోవడం. యుద్ధం మరియు శాంతి భార్యాభర్తల లాంటివి” అంటూ రాసుకొచ్చారు. ఇక అంతక ముందు చేసిన మరో ట్వీట్ లో ఆర్జీవీ స్పందిస్తూ “యుక్రెయిన్ దేశాధ్యక్షుడి సాహసోపేతమైన ప్రతిఘటనను ప్రపంచం నిరంతరం ప్రశంసించడంలో ప్రమాదం ఏమిటంటే, పుతిన్ మరింత ప్రమాదకరంగా మారడమని, ఉక్రేనియన్ల రక్తాన్ని చవిచూసేలా.. నియంత యొక్క అహాన్ని రెచ్చగొట్టడం కంటే ప్రమాదకరమైనది మరొకటి లేదు” అని చెప్పుకొచ్చారు.
Also read: Russia-Ukraine War: స్టార్ డ్యాన్సర్లతో యుక్రెయిన్ ప్రెసిడెంట్ డ్యాన్స్.. వైరల్‌గా మారిన వీడియో
మరోవైపు యుక్రెయిన్ ప్రతిఘటనను ఊహించని రష్యా ఇప్పటికే వందలాది మంది సైనికులను కోల్పోయింది. దీంతో తన పంతం నెగ్గేలా రష్యా అధ్యక్షుడు పుతిన్ మరికొన్ని యుద్ధ కుయుక్తులను పన్నుతున్నట్లు తెలుస్తుంది. ఆయుధాలు వీడి యుక్రెయిన్ ను అప్పగించని పక్షంలో.. ఎంతటి దారుణానికైనా తెగబడేందుకు పుతిన్ సిద్ధంగా ఉన్నట్లు పలువురు అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే యుక్రెయిన్ లో రష్యా సేనలు తడబాటును గుర్తించిన పుతిన్.. భవిష్యత్తులో పెద్ద ఎత్తున రసాయనిక దాడులకు పాల్పడేందుకు పావులు కదుపుతున్నట్లు పలు దేశాల నిఘావర్గాలు భావిస్తున్నాయి.
The only way to restore peace is to commit war and the only objective of war is to secure peace and so war and peace are like husband and wife
— Ram Gopal Varma (@RGVzoomin) February 27, 2022
Also read: Russia Ukraine War : రష్యాతో చర్చలకు సిద్ధమే, కానీ అక్కడ కాదు – జెలెన్ స్కీ ట్విస్ట్