Rajamouli
RGV : దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చరణ్, తారక్ లాంటి స్టార్ హీరోలతో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. సినిమాకి కలెక్షన్లు కూడా భారీగా వస్తున్నాయి. ఇప్పటికే మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది ఈ సినిమా. ఇక ఈ సినిమాపై అభిమానులు, ప్రేక్షకులతో సహా దేశ వ్యాప్తంగా చాలా మంది సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
అన్ని విషయాలపై వ్యంగ్యంగా ట్వీట్స్ చేసే ఆర్జీవీ కూడా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై పాజిటివ్ గా కామెంట్ చేశాడు. ఇటీవల ”బాహుబలి 2 అనేది చరిత్ర. ‘ఆర్‌ఆర్‌ఆర్’ అనేది చారిత్రాత్మకం. బాక్సాఫీస్‌కు మోక్షం కలిగించిన గొప్ప వ్యక్తి రాజమౌళి” అంటూ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని, రాజమౌళిని పొగుడుతూ ట్వీట్ చేశాడు ఆర్జీవీ. తాజాగా మరోసారి ‘ఆర్ఆర్ఆర్’పై ట్వీట్ చేసాడు ఆర్జీవీ. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి, రాజమౌళి గురించి పొగుడుతూ ఓ వాయిస్ లింక్ ని క్రియేట్ చేసి దానిని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. రాజమౌళి గురించి ‘ఆర్ఆర్ఆర్’పై నా వాయిస్ అంటూ పోస్ట్ చేశాడు ఆర్జీవీ.
Samantha : సమంత ఒక్కో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కి ఎంత సంపాదిస్తుందో తెలుసా??
ఈ వాయిస్ లో.. ”ఆర్‌ఆర్‌ఆర్ గురించి నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. ఈ సినిమా నాలోని చిన్నపిల్లాడిని బయటపెట్టింది. ఫేమస్, స్టేటస్ లాంటివి అన్నీ మర్చిపోయి సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని మనస్ఫూర్తిగా, ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ సినిమా చూశాను. ట్రైలర్ చూసినప్పుడే సినిమా బాగుంటుందని భావించాను. కానీ సినిమా చూశాక తెలిసింది ఇదొక అద్భుతమైన చిత్రం అని. సినిమా చూశాక ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. మాటలు కూడా కరవయ్యాయి.”
Upendra : తెలుగులో మళ్ళీ బిజీ అవుతున్న ఉపేంద్ర
”నేను దేని గురించి మాట్లాడినా ఫుల్ క్లారిటీగా ఉంటాను. కానీ జీవితంలో మొదటిసారి ఏం మాట్లాడాలో తెలియడం లేదు. కథేంటి? పాత్రలు ఎవరు? అనే విషయాన్ని పక్కనపెడితే కథ చెప్పిన విధానం, విజువల్‌గా స్క్రీన్‌పై చూపించిన తీరు నన్ను చాలా ఆకట్టుకుంది. చరణ్ పాత్ర బాగుంది, లేదు తారక్ పాత్ర బాగుంది అని కొంతమంది అంటున్నారు. ఆ రెండూ అనవసరమైన మాటలు. ఎందుకంటే, ఎవరికి వాళ్లే ప్రతి సీన్‌లోనూ అదరగొట్టేశారు. గడిచిన 30 ఏళ్లలో నేను ఇంతలా ఏ సినిమాని ఎంజాయ్ చేయలేదు. రాజమౌళి నువ్వు ప్రేక్షకులకు దొరికిన బంగారం, ప్రేక్షకుల కోసమే పుట్టావు. నీలాంటి వ్యక్తి ఈ భూమ్మీదకు వచ్చి సినిమానే కలగా చేసుకుని, దర్శకుడిగా మంచి చిత్రాలు తీస్తున్నందుకు సినీ ప్రియులంతా ఎంతో ఆనందిస్తున్నారు’’ అని రాజమౌళిపై ఆర్జీవీ ఇలా పొగడ్తల వర్షం కురిపించారు. అయితే ఈ వాయిస్ విన్న వాళ్లంతా ఆర్జీవీ మొదటి సారి ఇలా ఒకర్ని పొగడటం, ఆర్జీవీ మారిపోయారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
My VOICE LETTER to @ssrajamouli about #RRR https://t.co/5tAEmHp6Qa
— Ram Gopal Varma (@RGVzoomin) March 28, 2022