RGV Vyooham movie release facing censor board problem
Vyooham : సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ కి సంబంధించిన కథతో రెండు పార్టులుగా రెండు సినిమాలను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వ్యూహం, శపథం అనే టైటిల్స్ ని కూడా ఖరారు చేశాడు. రాజశేఖర్ రెడ్డి చనిపోయాక జగన్ పై జరిగిన కుట్రలు, జగన్ జీవితంలో 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది? ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఆ తర్వాత జగన్ సీఎం ఎలా అయ్యారు? సీఎం అయ్యాక ఏం చేశారు అనే అంశాలతో ఈ రెండు సినిమాలు ఉండనున్నాయి.
కాగా వ్యూహం సినిమాని 2023 నవంబర్ 10న రిలీజ్ చేస్తున్నట్టు, శపథం సినిమాని 2024 జనవరి 25న రిలీజ్ చేస్తున్నట్టు ఆల్రెడీ ఆర్జీవీ ప్రకటించాడు. అయితే ఈ సినిమాకి ఇప్పుడు సెన్సార్ బోర్డు మెంబర్స్ అభ్యంతరం వ్యక్తం చేశారట. సినిమాలోని క్యారెక్టర్స్ రియల్ లైఫ్ పర్సన్స్ ని పోలి ఉన్నాయని, పేర్లు కూడా అవే పెట్టారని అభ్యంతరం వ్యక్తం చేశారట. దీంతో ఈ సినిమా రిలీజ్ పై డౌట్ క్రియేట్ అయ్యింది. ఇక దీని పై ఆర్జీవీ కూడా రియాక్ట్ అవుతూ కామెంట్స్ చేశాడు.
Also read : Kannappa : కన్నప్ప సినిమాలో నటించే కామెడీ స్టార్స్ ఎవరో తెలుసా..?
రామ్ గోపాల్ వర్మ.. “అర చేతిని అడ్డు పెట్టి సూర్యడుని అపలేరు. సెన్సార్ బోర్డ్ ఎందుకు రివైజ్ కమిటీకి వెళ్ళమని చెప్పారో తెలియదు. వాళ్ళు ఏం చెప్పారో అదే చేస్తాం. నవంబర్ 10 నుండీ వ్యూహం సినిమా పోస్ట్ పోన్ చేస్తున్నాం. టిడిపి వాళ్ళు కంప్లెన్ట్ చేసారా అనేది తెలియదు” వెల్లడించాడు. ఇక ఈ పోస్టుపోన్ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. మరి ఆర్జీవీ ఇప్పుడు ఎలాంటి వ్యూహం రచిస్తాడో చూడాలి.