Rayavalasa : యూట్యూబ్లో దూసుకుపోతున్న రాయవలస మాస్ సాంగ్ విన్నారా..
కార్తీక్ జయంతి హీరోగా ఎంట్రీ ఇస్తూ శ్రీషా నులు హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా రాయవలస(Rayavalasa).
Ringudu Ringudu Lyrical from Rayavalasa movie
Rayavalasa : కార్తీక్ జయంతి హీరోగా ఎంట్రీ ఇస్తూ శ్రీషా నులు హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా రాయవలస. రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గోపీకృష్ణ నిర్మాణంలో ఎన్నారై డైరెక్టర్ రాధిక జయంతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. అమెరికా నుంచి ఇండియాకు వచ్చి రాధిక జయంతి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ రాగా ఇటీవల ‘రింగుడు రింగుడు’ సాంగ్ ని రిలీజ్ చేసారు.
ఈ సాంగ్ యూట్యూబ్లో 1 మిలియన్ వ్యూస్ దాటి చార్ట్ బస్టర్గా నిలిచింది. కార్తీక్ తన సొంత సంగీత ఛానల్ రేసన్ రికార్డ్స్ కూడా ప్రారంభించారు. నిర్మాత వంశీ నందిపాటి ఇటీవల ఈ ఛానల్ను ప్రారంభించారు. గ్రామీణ జీవితం, వాస్తవ సంఘటనల ఆధారంగా రాయవలస సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని ఒకే షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేసారు.
Supritha : చీర కట్టులో ముద్దుగా సురేఖ వాణి కూతురు.. నటి సుప్రీత ఫోటోలు వైరల్..
ఈ రింగుడు రింగుడు సాంగ్ ని అర్జున్ బాల సంగీత దర్శకత్వంలో తరుణ్ సైదుల్ రాయగా ధనుంజయ్, సాహితి చాగంటి పాడారు. మీరు కూడా ఈ సాంగ్ వినేయండి..
