Rishab Shetty Kantara Chapter 1 first look glimpse released
Kantara Chapter 1 : గత ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకు బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన కన్నడ చిత్రం ‘కాంతార’. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో సప్తమి గౌడ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా.. కేవలం 25 కోట్ల బడ్జెట్ తో రూపొంది బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడంతో సెకండ్ పార్ట్ ని కూడా తీసుకు రావాలని మేకర్స్ భావించారు.
అయితే సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. కాంతార సినిమా హీరో తండ్రి పాత్రతో ఈ ప్రీక్వెల్ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. కొన్ని వందల ఏళ్ళ క్రితం జరిగిన పంజుర్లి దైవ కథతో పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రాన్ని రిషబ్ శెట్టి రూపొందిస్తున్నారు. తాజాగా నేడు ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. గ్లింప్స్ చూస్తుంటే ఫస్ట్ పార్ట్ కి మించి ఈ ప్రీక్వెల్ ఉండబోతుందని తెలుస్తుంది. మరి ఆ అద్భుతమైన గ్లింప్స్ చూసేయండి.
Also read : Chiranjeevi : చిరంజీవి పై మన్సూర్ అలీఖాన్ కేసు పెట్టబోతున్నారా..?