Acharya : వివాదంలో ‘ఆచార్య’ సినిమా.. పోలీసులకి ఫిర్యాదు చేసిన RMPలు

ఇటీవలే ఈ సినిమా నుంచి 'శానా కష్టం...' అనే ఐటెం సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో దూసుకెళ్తుంది. ఇందులో మెగాస్టార్ తో రెజీనా స్టెప్పులేసింది. ఈ పాటకి కూడా......

Acharya

Acharya :   మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్ లో కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘ఆచార్య’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఫిబ్రవరిలో ఈ సినిమాని విడుదల చేయనున్నారని ఇప్పటికే ప్రకటించారు. ఇక ఈ సినిమా నుంచి వరుసగా టీజర్, ఒక్కో సాంగ్ ని విడుదల చేస్తున్నారు. వీటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది.

ఇటీవలే ఈ సినిమా నుంచి ‘శానా కష్టం…’ అనే ఐటెం సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో దూసుకెళ్తుంది. ఇందులో మెగాస్టార్ తో రెజీనా స్టెప్పులేసింది. ఈ పాటకి కూడా మంచి స్పందన లభిస్తుంది. అయితే తాజాగా ఈ పాటపై పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఈ పాటలో ఒక లైన్ లో ”ఏడేడో నిమురోచ్చని కుర్రోళ్ళు ఆర్ఎంపీలు అవుతున్నారు” అని ఉంది.

RGV : ఐకాన్ స్టార్ పై ప్రశంశలు కురిపించిన ఆర్జీవీ

పాటలోని ఈ లైన్ RMP వృత్తిని అవమానపర్చే విధంగా ఉందని, RMP, PMPల మనోభావాలు దెబ్బతినే విదంగా ఉందని రాష్ట్ర RMPల సంఘం నాయకులు ఆరోపించారు. అంతే కాక జనగామలో రాష్ట్ర RMPల సంఘం నాయకులు పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో పాట రచయిత, సినిమా దర్శకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సినిమాలో ఈ పాటని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.