Robert Downey : 30 ఏళ్లుగా ట్రై చేస్తుంటే.. హమ్మయ్య ఎట్టకేలకు ఐరన్ మ్యాన్‌కు ఆస్కార్ వచ్చింది.. కానీ..

ఐరన్ మ్యాన్‌ ఫేమ్ రాబర్ట్ డౌనీ ఎప్పట్నుంచో ఆస్కార్ కల కంటున్నాడు.

Robert Downey gets Best Supporting Actor Award for Oppenheimer in 96th Oscars Awards

Robert Downey : నేడు ఆస్కార్(Oscar) వేడుకలు ఘనంగా లాస్ ఏంజిల్స్ లో జరుగుతున్నాయి. 96వ ఆస్కార్ వేడుకల్లో ఓపెన్ హైమర్ సినిమాకు గాను ఐరన్ మ్యాన్‌ ఫేమ్ రాబర్ట్ డౌనీ జూనియర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు అందుకున్నారు. హాలీవుడ్ లో దాదాపు 1970 నుంచి సినిమాలు చేస్తున్న రాబర్ట్ డౌనీ ఐరన్ మ్యాన్‌ సినిమాలు, షెర్లాక్ హోమ్స్, అవెంజర్స్ సినిమాలతో బాగా పాపులర్ అయ్యారు. ఇండియాలో కూడా రాబర్ట్ డౌనీకి ఐరన్ మ్యాన్‌ గా మంచి గుర్తింపు వచ్చింది.

రాబర్ట్ డౌనీ ఎప్పట్నుంచో ఆస్కార్ కల కంటున్నాడు. 1993 లోనే మొదటిసారి చాప్లిన్ సినిమాకి బెస్ట్ యాక్టర్ గా ఆస్కార్ కి నామినేట్ అయ్యాడు. ఆ తర్వాత 2009 లో టాపిక్ థండర్ కి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నామినేట్ అయ్యాడు. ఆ రెండు సార్లు చివరి దాకా వెళ్లి వెనక్కి వచ్చేసాడు. దీంతో ఆస్కార్ అవార్డు కలగానే మిగిలిపోతుందేమో అనుకున్నాడు రాబర్ట్ డౌనీ. తనకు పేరు తెచ్చిపెట్టిన ఐరన్ మ్యాన్‌(Iron Man) సినిమాల తరపున కూడా అవార్డు రాలేదు. ఈసారి 2024 లో ఓపెన్ హైమర్ సినిమాకి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డుకి నామినేట్ అయ్యాడు.

Also Read : Allu Arjun : అల్లు అర్జున్ కొత్త యాడ్ చూశారా? పైప్ తో కొడితే.. లీక్ అయ్యేదేలే..

96వ అకాడమీ అవార్డుల్లో స్టెర్లింగ్ బ్రౌన్, రాబర్ట్ నీరో, ర్యాన్ గోస్లింగ్, మార్క్ రఫాల్లోతో పోటీ పడి రాబర్ట్ డౌనీ ఓపెన్ హైమర్ సినిమాకు గాను బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా ఆస్కార్ అవార్డు అందుకున్నాడు. దీంతో రాబర్ట్ డౌనీ పట్టరాని సంతోషంతో ఉన్నాడు. అయితే బెస్ట్ యాక్టర్ గా వస్తుంది అని ఇన్నాళ్లు అనుకోగా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ వచ్చింది. ఒకానొక దశలో అసలు ఆస్కార్ వస్తుందే లేదో లైఫ్ లో అని కూడా బాధపడ్డ రాబర్ట్ డౌనీ ఇప్పుడు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు అందుకోవడంతో సంతోషంగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐరన్ మెన్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు