Allu Arjun : అల్లు అర్జున్ కొత్త యాడ్ చూశారా? పైప్ తో కొడితే.. లీక్ అయ్యేదేలే..

అల్లు అర్జున్ ఆస్ట్రల్ పైప్స్ కి చేసిన కొత్త అడ్వర్టైజ్మెంట్ ని నేడు విడుదల చేశారు.

Allu Arjun : అల్లు అర్జున్ కొత్త యాడ్ చూశారా? పైప్ తో కొడితే.. లీక్ అయ్యేదేలే..

Allu Arjun Astral Pipes New Advertisement Released

Updated On : March 10, 2024 / 7:55 PM IST

Allu Arjun : అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 షూట్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ షెడ్యూల్ అయిపోగా రేపట్నుంచి వైజాగ్ లో మరో షెడ్యూల్ మొదలవుతుంది. దీంతో నేడు అల్లు అర్జున్ వైజాగ్ వెళ్లారు. బన్నీ వైజాగ్ రావడంతో అక్కడి అభిమానులు భారీ ర్యాలీతో, పూలు చల్లుతూ ఎయిర్ పోర్ట్ నుంచి అల్లు అర్జున్ ఉండే హోటల్ వరకు తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అల్లు అర్జున్ కొత్త ఫోటోలు చూసి అభిమానులు సంతోషిస్తున్నారు. వారి ఆనందం మరింత రెట్టింపు చేయడానికి అల్లు అర్జున్ కొత్త యాడ్ కూడా నేడే రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ ఆస్ట్రల్ పైప్స్ కి చేసిన కొత్త అడ్వర్టైజ్మెంట్ ని నేడు విడుదల చేశారు. ఈ యాడ్ లో ఓ బలవంతుడిని కొట్టడానికి అందరూ రకరకాల వాటితో ప్రయత్నించినా పడకపోవడంతో అల్లు అర్జున్ వచ్చి ఆస్ట్రల్ పైప్స్ తో కొట్టగానే కింద పడతాడు. అల్లు అర్జున్.. ఆస్ట్రల్ పైప్ లీక్ అయ్యేదేలే.. నీళ్లు ఆగేదేలే.. అంటూ డైలాగ్ చెప్పాడు.

Also Read : Tamannaah Bhatia : నా 19 ఏళ్ళ కెరీర్‌లో ఇలాంటి డైరెక్టర్ ని చూడలేదు.. వైరల్ అవుతున్న తమన్నా పోస్టు..

దీంతో అల్లు అర్జున్ కొత్త యాడ్ వైరల్ గా మారింది. దీంట్లో కూడా పుష్ప డైలాగ్ ఫార్మేట్ లో డైలాగ్ చెప్పడంతో ఫ్యాన్స్ కూడా తెగ షేర్ చేస్తున్నారు. మీరు కూడా అల్లు అర్జున్ కొత్త యాడ్ చూసేయండి.