Yash : నేను బాలీవుడ్ కి వెళ్ళను.. ఎవరైనా నా దగ్గరికే రావాలి.. రాకింగ్ స్టార్ యశ్ మాస్ రిప్లై..
కేజీఎఫ్ సినిమాల తర్వాత యశ్ ఏ సినిమా చేస్తాడా అని అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే యశ్ నెక్స్ట్ సినిమాపై అనేక రూమర్స్ వచ్చాయి.

Rocking star Yash comments on his Bollywood Movies
Rocking Star Yash : కన్నడ హీరో యశ్ కేజీఎఫ్ సినిమాలతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. కేజీఎఫ్ ముందు వరకు కన్నడ సినీ పరిశ్రమకు తప్ప బయటి వాళ్లకు ఎక్కువగా తెలియని యశ్ ఈ సినిమాలతో దేశమంతా ఫేవరేట్ అయ్యాడు. కేజీఎఫ్ 2 సినిమా అయితే ఏకంగా 1100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి కన్నడ సినీ పరిశ్రమ స్థాయిని మార్చేసింది.
ఇక కేజీఎఫ్ సినిమాల తర్వాత యశ్ ఏ సినిమా చేస్తాడా అని అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే యశ్ నెక్స్ట్ సినిమాపై అనేక రూమర్స్ వచ్చాయి. మళ్ళీ కేజీఎఫ్ 3 తీస్తాడని, పలువురు స్టార్ డైరెక్టర్స్ తో సినిమా అని, బాలీవుడ్ కి వెళ్తాడని, బాలీవుడ్ సినిమాలో గెస్ట్ అప్పీరెన్స్ అని.. ఇలా అనేక వార్తలు వచ్చాయి. ప్రస్తుతం యశ్ మలయాళం లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి.
Bhola Shankar : భోళా శంకర్ మూవీ టీజర్ లాంచ్.. థియేటర్ల లిస్ట్ ఇదే..
తాజాగా యశ్ ఫ్యామిలీతో కలిసి ఓ ఆలయానికి వెళ్లగా యశ్ ని చూడటానికి భారీగా అభిమానులు, మీడియా కూడా వచ్చారు. ఈ నేపథ్యంలో మీడియా యశ్ ని తన నెక్స్ట్ సినిమా ఏంటి? బాలీవుడ్ కి వెళ్తున్నారని అంటున్నారు నిజమేనా అని ప్రశ్నలు వేసింది. వీటికి యశ్ సమాధానమిస్తూ.. నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఉన్న చోటికే అందర్నీ రప్పిస్తాను, త్వరలోనే నెక్స్ట్ సినిమా గురించి చెప్తాను అని తెలిపాడు. దీంతో యశ్ చెప్పిన సమాధానం ప్రస్తుతం వైరల్ గా మారింది. యశ్ మాస్ రిప్లైకి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇక అభిమానులైతే రాకింగ్ స్టార్ అంటే ఆ మాత్రం ఉంటుంది అని అంటున్నారు.