Rohit Shetty Cop Universe Ajay Devgn Singham Again Movie Trailer Released
Singham Again : బాలీవుడ్ మాస్ డైరెక్టర్ రోహిత్ శెట్టి తాను తీసిన పోలీస్ సినిమాలన్నిటిని లింక్ చేస్తూ కాప్ యూనివర్స్ సృష్టించి త్వరలో సింగం ఎగైన్ అనే సినిమాతో రాబోతున్నాడు.తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. ట్రైలర్ లో సినిమా కథని రామాయణంతో లింక్ చేస్తూ రాముడు శ్రీలంకకు వెళ్లి సీతని ఎలా కాపాడాడు, ఎవరి సహాయంతో కాపాడాడు అన్నట్టు హీరో హీరోయిన్ ని ఎలా కాపాడాడు అన్నట్టు చూపించారు.
Also Read : Dimplee Hyati : ఏనుగు టాటూ వేయించుకొని.. ఏనుగులతో ఆడుకుంటున్న హీరోయిన్..
ఇక ఈ సినిమాలో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తుండగా అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, దీపికా పదుకోన్, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్, జాకీ ష్రాఫ్, కరీనా కపూర్.. ఇలా స్టార్స్ అంతా నటిస్తున్నారు. ట్రైలర్ లోనే వీళ్ళందర్నీ చూపించి సినిమాపై ఫుల్ హైప్ పెంచారు. ఈ పోలీస్ యూనివర్స్ సినిమా కోసం బాలీవుడ్ జనాలతో పాటు రోహిత్ శెట్టి తెలుగు ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. సింగ ఎగైన్ సినిమా దీపావళికి రిలీజ్ చేయబోతున్నారు.
సింగం ఎగైన్ మాస్ ట్రైలర్ మీరు కూడా చూసేయండి..