Roja Dance With Srikanth in TV Show Promo Goes Viral
Roja – Srikanth : నటి, మాజీ మంత్రి రోజా గతంలో రాజకీయాల్లో బిజీ అవ్వడం, మంత్రి పదవి రావడంతో సినిమాలతో పాటు జబర్దస్త్ లాంటి టీవీ షోలకు కూడా బ్రేక్ ఇచ్చింది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత రోజా ఓ టీవీ షోతో రీ ఎంట్రీ ఇస్తుంది. జీ తెలుగులో సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ సీజన్ 4 ప్రోగ్రాంలో రోజా రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే ఈ ప్రోగ్రాంకు సంబంధించి పలు ప్రోమోలు రిలీజ్ అవ్వగా అవి వైరల్ అయ్యాయి.
రోజా రీ ఎంట్రీలో కూడా ఫుల్ హుషారుగా కనపడటంతో ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ ప్రోగ్రాం నుంచి మరో ప్రోమోని రిలీజ్ చేసారు. ఈ ప్రోగ్రాంకి రోజాతో పాటు శ్రీకాంత్, రాశి కూడా వచ్చి సందడి చేసారు. ఈ ప్రోగ్రామ్ లో సీరియల్ స్టార్స్ ని రెండు గ్రూప్స్ గా విడగొట్టి అంత్యాక్షరి ఆడించారు. శ్రీకాంత్, రాశి, రోజా కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ క్రమంలో కొన్ని పాటలకు శ్రీకాంత్ – రాశి, శ్రీకాంత్ – రోజాలు డ్యాన్స్ వేశారు.
Also Read : Anil Ravipudi : సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన అనిల్ రావిపూడి.. ఇకపై అలా చేస్తే అంటూ హెచ్చరించిన అనిల్..
రోజా గతంలో సినిమాల్లోనే కాక టీవీ షోలలో డ్యాన్సులు వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రీ ఎంట్రీలో మొదటి ప్రోగ్రాంలోనే రోజా శ్రీకాంత్ తో కలిసి డ్యాన్స్ వేయడంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది. ఆమె ఫ్యాన్స్ ఈ ప్రోగ్రాం గురించి వెయిట్ చేస్తున్నారు. గతంలో రోజా – శ్రీకాంత్ కలిసి ఓ నాలుగైదు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. గత ప్రోమోలో శ్రీకాంత్ సరదాగా రోజాకు కౌంటర్లు వేసినట్టు చూపించారు. శ్రీకాంత్ – రాశి – రోజా కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమా స్కిట్ కూడా చేసారు. దీంతో ఫ్యాన్స్, ఆడియన్స్ ఈ ప్రోగ్రాం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ప్రోగ్రాం జీ తెలుగులో నేడు సాయంత్రం 6 గంటలకు రానుంది. రోజా – శ్రీకాంత్ కలిసి డ్యాన్స్ వేసిన ప్రోమో మీరు కూడా చూసేయండి..
Also Read : Summer Movies 2025 : ఈ సారి సమ్మర్ సినిమాలు ఇవే.. పవర్ స్టార్, మెగాస్టార్, రౌడీ స్టార్.. అందరూ వరుసపెట్టి..
ఇటీవల కొన్ని రోజుల క్రితం ప్రభుదేవా నిర్వహించిన లైవ్ డ్యాన్స్ ఈవెంట్ లో కూడా రోజా ప్రభుదేవాతో కలిసి మాస్ డ్యాన్స్ వేసి ఆడియన్స్ ని మెప్పించింది. ఆ వీడియోలు కూడా వైరల్ గా మారాయి. గత ఎన్నికల్లో రోజా ఎమ్మెల్యేగా ఓడిపోవడం, ప్రభుత్వం కూడా మారడంతో మళ్ళీ రోజా టీవీ షోలలోకి రీ ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి తనకి పేరు తెచ్చిపెట్టిన జబర్దస్త్ షోకి కూడా మళ్ళీ తిరిగొస్తుందా? రోజా మళ్ళీ సినిమాలు చేస్తుందా చూడాలి.