Roja Meena Sangeetha and Some Other Senior Heroins in Prabhudeva Event Photo goes Viral
Senior Heroins : అప్పుడప్పుడు మన సీనియర్ స్టార్స్ కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా 80s, 90s హీరోలు, హీరోయిన్స్ అప్పుడప్పుడు కలిసి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఫ్యాన్స్, సినిమా లవర్స్ సంతోషం వ్యక్తం చేస్తారు. తాజాగా కొంతమంది సీనియర్ స్టార్ హీరోయిన్స్ ఒక ఈవెంట్లో కలవడంతో అందరూ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
నిన్న చెన్నైలో ప్రభుదేవా లైవ్ డ్యాన్స్ కాన్సర్ట్ వైబ్ అనే పేరుతో కండక్ట్ చేసారు. ఈ ఈవెంట్ కు పలువురు హీరోలు, హీరోయిన్స్, సెలబ్రిటీలు కూడా వచ్చి సందడి చేసారు. ఈ క్రమంలో అలనాటి సీనియర్ హీరోయిన్స్ మీనా, రోజా, సంగీత, శ్రీదేవి విజయ్ కుమార్, మహేశ్వరి,రంభ.. కలిసి ఫోటోలు దిగారు. ఈ ఫోటోలను మీనా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ హీరోయిన్ ఫ్యాన్స్ ఈ ఫోటోని తెగ వైరల్ చేస్తున్నారు.
రోజా, మీనా, సంగీత, మహేశ్వరి, శ్రీదేవి,రంభ.. వీళ్లంతా కూడా తెలుగు, తమిళ్ సినిమాల్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా ఒక వెలుగు వెలిగారు. అందరూ స్టార్ హీరోలతో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించి ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు. వీళ్లల్లో మహేశ్వరీ తప్ప మిగిలిన వారంతా ఇప్పటికి సినిమాల్లోనో, టీవీ షోలలోనో కనిపించి అలరిస్తున్నారు.
మీనా, రోజా కలిసి ప్రభుదేవాతో కలిసి ఈ వైబ్ ఈవెంట్లో స్టేజిపై స్టెప్పులు కూడా వేశారు. స్టెప్పులు వేస్తన్న ఫోటో కూడా మీనా షేర్ చేసింది. మొత్తానికి చాలా రోజుల తర్వాత అలనాటి హీరోయిన్స్ కలిసి కనిపించి ప్రేక్షకులకు కనువిందు చేస్తున్నారు.