Aaradhya Devi – RGV : అషురెడ్డి వీడియో పంపించి.. ఆర్జీవీతో జాగ్రత్త అన్నారు.. సినిమా ఆఫర్ పై ఆరాధ్య సంచలన కామెంట్స్..

ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా ఆర్జీవీ - ఆరాధ్య కలిసి పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

Aaradhya Devi – RGV : అషురెడ్డి వీడియో పంపించి.. ఆర్జీవీతో జాగ్రత్త అన్నారు.. సినిమా ఆఫర్ పై ఆరాధ్య సంచలన కామెంట్స్..

Aaradhya Devi Interesting Comments on RGV someone said bad about him with sending Ashu Reddy Videos

Updated On : February 24, 2025 / 3:58 PM IST

Aaradhya Devi – RGV : ఆర్జీవీ కొన్నాళ్ల క్రితం కేరళకు చెందిన శ్రీలక్ష్మి సతీష్ అనే సోషల్ మీడియా స్టార్ ని పాపులర్ చేసి ఆమెతో శారీ అనే సినిమా తీస్తానని ప్రకటించాడు. ఆ అమ్మాయిని వెతికి పట్టుకొని మరీ ఆ అమ్మాయిని కాంటాక్ట్ అయి ఇక్కడకు తెప్పించి ఆ అమ్మాయిని పూర్తిగా మార్చేసి శారీ అనే సినిమా తీసాడు ఆర్జీవీ. తను చీరకట్టులో పాపులర్ అయితే ఆర్జీవీ తనని అదే చీరకట్టులో అందాలు చూపించే విధంగా చేసి అందరికి షాక్ ఇచ్చాడు.

శ్రీలక్ష్మి సతీష్ ని ఆరాధ్య దేవిగా మార్చేసి శారీ సినిమా తీయడం, ఈ సినిమాలో ఆమెతో అందాలు ఆరబోత బాగా చేయించడంతో ఆర్జీవీ మామూలోడు కాదు అని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసారు ఈ అమ్మాయిని. ఇప్పటికే శారీ సినిమా నుంచి టీజర్, సాంగ్స్, ట్రైలర్ రిలీజయ్యాయి. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా ఆర్జీవీ – ఆరాధ్య కలిసి పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

Also Read : Urvashi Rautela : బాబాయ్ తో అయిపోయింది.. నెక్స్ట్ అబ్బాయితో.. జోరు మీదున్న ఊర్వశి.. సుక్కు సినిమాలో కూడా..?

ఒక ఇంటర్వ్యూలో ఆర్జీవీ నుంచి ఆఫర్ వచ్చినప్పుడు ఆయన గురించి మీకు ఎవరైనా ఏమైనా చెప్పారా అని అడగ్గా ఆరాధ్య సమాధానమిస్తూ.. మొదట ఆర్జీవీ ఎవరో నాకు తెలీదు. ఆర్జీవీ నన్ను వెతుకుతున్నారు అని తెలిసి నా సోషల్ మీడియా ఫాలోవర్స్ ఒక్కసారిగా పెరిగిపోయారు, మెసేజెస్ వచ్చేవి. సినిమా కోసం నన్ను కాంటాక్ట్ చేసాక చాలా మంది ఆయన సినిమాల గురించి గొప్పగా చెప్పారు. అలాగే ఆయన గురించి బ్యాడ్ గా చెప్పారు. నేను ఆయన సినిమాలు చూసాను. కొంతమంది అషురెడ్డితో ఆర్జీవీ గారు ఉన్న వీడియో పంపించి అతను ఇలాంటి వాడు, అతనితో సినిమాలు చేయకు, అతనితో జాగ్రత్త అని చెప్పారు. కానీ నేను ఆర్జీవీ గారిని కలిసినప్పుడు ఆయన చాలా క్లారిటీగా సినిమా గురించి చెప్పారు. ఇందులో అన్ని సీన్స్ నేను కంఫర్ట్ గానే చేశాను అని తెలిపింది.

Also Read : Hari Hara Veera Mallu Song : ‘హరిహర వీరమల్లు’ సెకండ్ సాంగ్ వచ్చేసింది.. పాట అదిరింది.. పవన్ డ్యాన్స్ సూపర్..

గతంలో అషురెడ్డితో ఆర్జీవీ ఓ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆర్జీవీ అషురెడ్డి కాలు నాకుతాడు. అప్పట్లో ఆ వీడియో వైరల్ అయి వివాదం కూడా అయింది. ఆ వీడియోనే ఆరాధ్యకు పంపించి పలువురు ఆర్జీవీ గురించి నెగిటివ్ గా చెప్పారని తెలిపింది. అయినా తనకు వచ్చిన ఆఫర్ వదులుకోకూడదు అని సినిమాలో కంఫర్ట్ గానే ఉందని ఈ శారీ సినిమాకు ఒప్పుకుంది ఆరాధ్య. త్వరలో శారీ సినిమా రానుంది. మరి ఈ శారీ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.