Hari Hara Veera Mallu Song : ‘హరిహర వీరమల్లు’ సెకండ్ సాంగ్ వచ్చేసింది.. పాట అదిరింది.. పవన్ డ్యాన్స్ సూపర్..
పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా నుంచి రెండో సాంగ్ విడుదల అయింది.

Pawan Kalyan Hari Hara Veera Mallu Second Song Released
Hari Hara Veera Mallu Song : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ. దయాకర్ రావు ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, ఒక సాంగ్ రిలీజ్ చేయగా నేడు రెండో పాటను విడుదల చేసారు.
Also Read : Mumaith Khan : కొత్త బిజినెస్ లోకి ముమైత్ ఖాన్.. హైదరాబాద్ లో మేకప్ అండ్ హెయిర్ అకాడమీ..
హరి హర వీర మల్లు నుంచి రెండో పాటగా కోర కోర మీసాలతో కొదమ కొదమ అడుగులతో.. అంటూ వీరమల్లుని పొగుడుతూ ఉంది ఈ సాంగ్. మంచి మాస్ బీట్ తో సాంగ్ అదిరిపోయింది. పవన్ కళ్యాణ్ కు జంటగా నిధి అగర్వాల్ ఉండగా ఈ పాటలో అనసూయ భరద్వాజ్, పూజిత పొన్నాడ కూడా మెరిపించారు. మీరు కూడా ఈ పాట వినేయండి..
ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. ఈ పాటను తెలుగులో చంద్రబోస్, తమిళంలో పా. విజయ్, మలయాళంలో మంకొంబు గోపాలకృష్ణన్, కన్నడలో వరదరాజ్, హిందీలో అబ్బాస్ టైరేవాలా రాశారు. ఈ పాటను వివిధ భాషల్లో మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా, యామిని ఘంటసాల, ఐరా ఉడిపి, మోహన భోగరాజు, వైష్ణవి కన్నన్, సుదీప్ కుమార్, అరుణ మేరీ పాడారు.
Also Read : Mumaith Khan: పెళ్లిపై మొట్టమొదటిసారి ముమైత్ ఖాన్ రియాక్షన్.. పుష్ప సినిమాపై కూడా కామెంట్..
హరిహర వీరమల్లు సినిమా 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో భారీ బడ్జెట్ తో పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్, నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి.. లాంటి స్టార్స్ నటిస్తున్నారు. హరిహర వీరమల్లు పార్ట్ 1 సినిమా 2025 మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.