Mumaith Khan : కొత్త బిజినెస్ లోకి ముమైత్ ఖాన్.. హైదరాబాద్ లో మేకప్ అండ్ హెయిర్ అకాడమీ..
ముమైత్ మరికొంతమందితో కలిసి ఓ మేకప్ అండ్ హెయిర్ అకాడమీ స్థాపించింది.

Mumaith Khan Started Welyke Makeup and Hair Academy In Hyderabad
Mumaith Khan : పోకిరి సినిమాలో ఇప్పటికింకా నా వయసు నిండా పదహారు.. అంటూ అప్పట్లో కుర్రాళ్లకు చెమటలు పట్టించిన ముమైత్ ఆ తర్వాత అనేక సినిమాల్లో ఐటెం సాంగ్స్, నటిగా నటించింది. సినిమాలతో ఫేమ్ తెచ్చుకున్న ముమైత్ బిగ్ బాస్ లో కూడా పాల్గొంది. ముమైత్ మరికొంతమందితో కలిసి ఓ మేకప్ అండ్ హెయిర్ అకాడమీ స్థాపించింది.
బ్యూటీ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ కి సంబంధించి హైదరాబాద్ యూసుఫ్‌గూడ లోని వీలైక్ మేకప్ అండ్ హెయిర్ అకాడమీ ఓపెనింగ్ చేసారు. నేడు ఇక్కడ బ్రైడల్, మేకప్, హెయిర్ స్టైలింగ్, కాస్మోటాలజీ, స్కిన్‌కేర్ మరియు వెల్‌నెస్‌లో నైపుణ్యం పై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీలైక్ అకాడమీ డైరెక్టర్ ముమైత్ ఖాన్ తో పాటు కో ఫౌండర్స్ కెయిత్, జావేద్, ఆర్టిస్టులు జ్యోతి, అక్స ఖాన్, సింగర్ రోల్ రైడా, డ్యాన్స్ మాస్టర్ జోసఫ్.. పలువురు పాల్గొన్నారు.
Also Read : Mumaith Khan: అవకాశాలు వస్తే ఇప్పటికీ అటువంటి డ్యాన్సులు చేస్తా.. కానీ..: ముమైత్ ఖాన్
ఈ అకాడమీ ప్రారంభించిన అనంతరం ముమైత్ మాట్లాడుతూ.. బ్యూటీ పరిశ్రమపై ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులకు దానిపై అవగాహనా కల్పిస్తాం. బ్రైడల్ & హెయిర్ మేకప్ ట్రైనింగ్ లో బెస్ట్ ఇస్తాం. ఈ పరిశ్రమలో ఉన్న కొత్త కొత్త విధానాలను నేర్పిస్తాం. కెరీర్ అవకాశాలు కూడా చూపిస్తాము. కొత్త కొత్త బ్రైడల్ హెయిర్ & మేకప్ కోర్సులు, హెయిర్‌స్టైలింగ్ పద్ధతులు, మేకప్ ఆర్టిస్ట్రీ, చర్మ సంరక్షణ చికిత్సలు, నెయిల్ టెక్నాలజీతో పాటు అనేక రకాల ప్రొఫెషనల్ కోర్సులు అందిస్తున్నాము అని తెలిపారు.
ఈ అకాడమీ ప్రారంభానికి ముమైత్ స్నేహితులు, పలువురు సినీ పరిశ్రమ వ్యక్తులు కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ముమైత్ పలు మీడియా ఛానల్స్ కు ఇంటర్వ్యూ లు ఇచ్చింది.
Also Read : Mumaith Khan: నాకు యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ పరిస్థితి వచ్చింది: చాలా రోజుల తర్వాత మీడియాతో ముమైత్ ఖాన్