Mumaith Khan: నాకు యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ పరిస్థితి వచ్చింది: చాలా రోజుల తర్వాత మీడియాతో ముమైత్ ఖాన్
ఇండస్ట్రీకి మళ్లీ వస్తానని, అయితే దాని తర్వాత కూడా ఏం చేయొచ్చో ఆలోచించానని తెలిపారు.

Actress Mumaith Khan
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఐటమ్ సాంగ్స్‌తో పాపులర్ అయిన నటి ముమైత్ ఖాన్ ఇప్పుడు బ్యూటీ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్ యూసఫ్‌గూడలోని వీలైక్ మేకప్ అండ్ హెయిర్ అకాడమీలో ఇవాళ ఓ సదస్సు నిర్వహించారు.
ముమైత్ ఖాన్ ఈ అకాడమీకి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె 10టీవీతో మాట్లాడుతూ పలు వివరాలు తెలిపారు. సినీ పరిశ్రమలో బ్రేక్ వచ్చిందని, తనకు యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ పరిస్థితి వచ్చిందని అన్నారు. దీంతో తాను ఏం చేయాలని బాగా ఆలోచించానని అన్నారు.
ఇండస్ట్రీకి మళ్లీ వస్తానని, అయితే దాని తర్వాత కూడా ఏం చేయొచ్చో ఆలోచించానని ముమైత్ ఖాన్ తెలిపారు. పర్మినెంట్‌గా తనకంటూ సంపాదించడానికి ఏదో ఒకటి ఉండాలని అనుకున్నానని చెప్పారు.
Also Read: కారు కొంటారా భయ్యా.. మతిపోగొట్టే ఫీచర్లతో ఈ కారు వస్తోంది.. ఒక్కసారి చూడండి..
అందుకే, తాను మరో పని చేయాలని, బిజినెస్ చేయాలని నిర్ణయించుకున్నానని అందుకే మేకప్ అండ్ హెయిర్ అకాడమీ నడిపిస్తున్నానని ముమైత్ ఖాన్ తెలిపారు. మేకప్‌లో సౌత్, నార్త్ అని వేర్వేరుగా కాకుండా రెండింటినీ కలిపితే కొత్త ఔట్‌పుట్ వస్తుందని చెప్పారు. అదే తాను చేయాలనుకుంటున్నానని అన్నారు. మేకప్‌లో అప్‌డేటెడ్ వర్షన్ అందిస్తానని తెలిపారు.
కాగా, పోకిరీ సినిమాలో ఐటెం సాంగ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ముమైత్ ఖాన్ ఆ తర్వాత పలు సినిమాల్లో ముఖ్య పాత్రల్లోనూ కనపడ్డారు. ముమైత్ ఖాన్ తెలుగులో మైసమ్మ ఐపీఎస్, ఎవడైతే నాకేంటి, ఆపరేషన్ దుర్యోధన, నేనింతే వంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది.