కారు కొంటారా భయ్యా.. మతిపోగొట్టే ఫీచర్లతో ఈ కారు వస్తోంది.. ఒక్కసారి చూడండి..
ప్రస్తుతం ఐదు-సీట్ల వేరియంట్ ధరలు రూ.10.99 లక్షలు, రూ .20.09 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా త్రీ రో వెర్షన్‌ను హరియాణాలోని ఆ సంస్థ ఖార్ఖ్‌హోడా ప్లాంట్ సమీపంలో మళ్లీ పరీక్షించారు. ఇది ఏడు సీట్లతో వస్తున్న ఎస్‌యూవీ. ఈ కారును ఈ ఏడాది చివరలో లాంచ్ చేయనున్నారు.
ప్రస్తుతం ఐదు సీట్ల గ్రాండ్ విటారా మార్కెట్లో అందుబాటులో ఉంది. దానికి ఇది బిగ్గెర్ వెర్షన్ అవుతుంది. ఈ కారులో దానికంటే అదనపు సీట్లు, ఎక్కువ స్థలం ఉంటుంది.
మారుతి సుజుకి గ్రాండ్ విటారా త్రీ రో వెర్షన్.. మారుతి సుజుకి ఈ విటారా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీను ప్రేరణగా తీసుకుని రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ కొత్త ఎస్‌వీయూను హరియాణాలోని ఖార్ఖోడాలోని మారుతి సుజుకి కంపెనీలో ఉత్పత్తి చేస్తున్నారు.
గ్రాండ్ విటారా ఏడు సీట్ల వెర్షన్ గ్లోబల్ సీ-ప్లాట్‌ఫాంను బేస్ చేసుకుని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా త్రీ రో వెర్షన్ కార్ల ఇమేజ్‌లు బయటకు వచ్చాయి. వాటి ప్రకారం.. ఈ కొత్త కారు సైజులో పెద్దగా, కొత్త అల్లాయ్ వీల్స్‌తో కనపడుతోంది.
దాని ముందు భాగంలో రిఫ్రెష్ చేసిన గ్రిల్, రీ డిజైన్ చేసిన బంపర్, రివైజ్డ్ హెడ్‌ల్యాంప్ సెటప్‌తో డూలైట్ రన్నింగ్ లైట్స్ ఉన్నాయి. ఇక వెనుక భాగంలో.. ఎస్‌యూవీకి కనెక్ట్ చేసిన ఎల్‌ఈడీ టైలంప్స్, షార్క్-ఫిన్ యాంటెన్నా, కొత్త రియర్ బంపర్ ఉన్నట్లు తెలుస్తోంది.
లోపల భాగం విషయానికి వస్తే.. ఈ బిగ్గెర్ గ్రాండ్ విటారా రీడిజైన్డ్ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్‌తో ఉన్న డాష్‌బోర్డ్‌తో వస్తుంది. పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్ వంటివి వాటితో ఇది వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: బంగారం రేట్లు ఇప్పట్లో తగ్గవ్..! కారణం ఇదే.. విశ్లేషకులు చెప్పిన మాట వింటే..
ఈ మారుతి సుజుకి గ్రాండ్ విటారా త్రీ రో వెర్షన్.. ఐదు-సీట్ల వెర్షన్ లాగే అదే బేస్ నిర్మాణంతో వస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, అదే ఇంజిన్ ఆప్షన్లతో వస్తుందని నిపుణులు భావిస్తున్నారు. 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్, .5-లీటర్ హైబ్రిడ్ ఇంజిన్‌తో వస్తుంది.
ఈ కొత్త 7-సీట్ల గ్రాండ్ విటారా.. హ్యుందాయ్ అల్కాజార్, టాటా సఫారి, మహీంద్రా ఎక్స్‌యూవీ700, మహీంద్రా స్కార్పియో-ఎన్, కియా కేరెన్స్, ఎంజీ హెక్టర్ ప్లస్ వంటి వాటితో పోటీపడుతుంది.
మారుతి సుజుకి 2025 నాల్గో త్రైమాసికంలో లేదా 2026 మొదటి త్రైమాసికంలో ఈ 7-సీట్ల గ్రాండ్ విటారాను లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఇక ధరల విషయానికొస్తే.. త్రీ రో గ్రాండ్ విటారా ఐదు-సీట్ల వేరియంట్ కంటే ఈ 7-సీట్ల గ్రాండ్ విటారా ధర ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఐదు-సీట్ల వేరియంట్ ధరలు ధర రూ.10.99 లక్షలు, రూ .20.09 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఇప్పుడు 7-సీట్ల గ్రాండ్ విటారా ధర దానికంటే ఎక్కువగా ఉంటుంది.