Mumaith Khan: అవకాశాలు వస్తే ఇప్పటికీ అటువంటి డ్యాన్సులు చేస్తా.. కానీ..: ముమైత్ ఖాన్
ఇప్పటికీ తనలో అదే ఎనర్జీ ఉందని ముమైత్ ఖాన్ తెలిపారు.

Mumaith Khan
పోకిరీ సినిమాలో ఇప్పటికింకా నా వయసు ఇంకా పదహారే అంటూ డ్యాన్స్ చేసి యువతను ఉర్రూతలూగించిన ముమైత్ ఖాన్ ఇటీవల సినిమాల్లో కనపడడం లేదు. అయితే, అవకాశాలు వస్తే ఇప్పటికీ అటువంటి డ్యాన్సులు చేస్తానని ముమైత్ ఖాన్ అంటున్నారు.
ముమైత్ ఖాన్ ఇప్పుడు బ్యూటీ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టింది. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలోని వీలైక్ మేకప్ అండ్ హెయిర్ అకాడమీలో ఇవాళ ఓ సదస్సు నిర్వహించారు. ముమైత్ ఖాన్ ఈ అకాడమీకి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఆమె 10టీవీతో మాట్లాడుతూ పలు వివరాలు తెలిపారు. తన అమ్మ మంచివారికి దేవుడే మంచే చేస్తాడని అనేవారని, అందుకే తాను ఎల్లప్పుడు హ్యాపీగానే ఉంటున్నానని తెలిపారు.
పోకిరి సినిమాలో “ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే” అన్న పాటలో డ్యాన్స్ చేశానని గుర్తు చేసుకుంటూ.. అవకాశాలు వస్తే ఇప్పటికీ అటువంటి డ్యాన్సులు చేస్తానని చెప్పారు. ఇప్పటికీ తనలో అదే ఎనర్జీ ఉందని తెలిపారు. ముమైత్ ఖాన్ ఐటం సాంగ్స్ చేసిన సినిమాల్లోని హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్లు అయిపోయారు. దీనిపై కూడా ఆమె స్పందించారు. వారంతా పాన్ ఇండియా స్టార్లు అయిపోయారు కదా? అని అడిగితే అవును అంటూ సమాధానం ఇచ్చారు.
తనకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని ముమైత్ ఖాన్ అన్నారు. సినిమాల్లో చాలా చేంజెస్ వచ్చాయని, చాలా మంది పాన్ ఇండియా యాక్టర్లు అయిపోయారని అన్నారు. తనకు యాక్సిడెంట్ అయిందని, బ్రేక్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పారని, ఏడేళ్లు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పారని తెలిపారు. ఏడేళ్ల గడిచాయని, అందుకే ఇప్పుడు మళ్లీ బిజినెస్‌లోకి వచ్చానని అన్నారు.