Mumaith Khan: పెళ్లిపై మొట్టమొదటిసారి ముమైత్ ఖాన్ రియాక్షన్.. పుష్ప సినిమాపై కూడా కామెంట్..
ఇండస్ట్రీలో ఎక్కువగా లైక్ చేసే స్టార్ ఎవరు అన్న ప్రశ్నకు కూడా ముమైత్ ఖాన్ స్పందించారు.

Mumaith Khan
అప్పట్లో వచ్చిన పోకిరీ సినిమాలో ఐటెంగ్ సాంగ్‌లో భాగంగా తనకు కాబోయే భర్త ఎలా ఉండాలన్న విషయంపై ముమైత్ ఖాన్ ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తారు. కానీ, నిజ జీవితంలో మాత్రం మరోలా సమాధానం చెబుతున్నారు.
పోకిరీ సినిమాలో ముమైత్ ఖాన్.. “ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే.. చీటికీ మాటికీ చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్లే.. పడకింటిలో ప్లాటినం పరుపే వెయ్యలే.. డాల్లర్సుతో డైలీ నాకు పూజలు చెయ్యాలె. బంగారమే కరిగించి ఇల్లంతా పరచాలే. వజ్రాలతో వొళ్లంతా నింపేసి పోవాలే” అంటూ తనకు నచ్చే కుర్రాడి గురించి చెబుతుంది.
తాజాగా, 10టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం పెళ్లి గురించి మరోలా మాట్లాడారు. పెళ్లి చేసుకోరా అన్న ప్రశ్నకు.. “తెలియదు” అని సమాధానం ఇచ్చారు. ఎలాంటి పెళ్లి కొడుకు కావాలి? అన్న ప్రశ్నకు అది కూడా “తెలియద”ని తెలిపారు.
ఇప్పుడయితే బిజినెస్ చేయాలని అది మాత్రమే తనకు తెలుసని ముమైత్ ఖాన్ అన్నారు. ఇండస్ట్రీలో ఎక్కువగా లైక్ చేసే స్టార్ ఎవరు అన్న ప్రశ్నలకు ముమైత్ ఖాన్ స్పందిస్తూ.. “అందరూ..” అని సమాధానం చెప్పారు. తాను అందరితోనూ పనిచేశానని అన్నారు. ప్రస్తుతమైతే అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమని అన్నారు.
పుష్ప సినిమాను హిందీలో చూశానని ముమైత్ ఖాన్ చెప్పారు. డ్యాన్స్ అకాడమీ పెట్టాలన్న ఆలోచనలు వంటివి ఇప్పటివరకు ఏమీ రాలేదని తెలిపారు. హైదరాబాద్‌లోనే సెటిల్ అయిపోవడం అంటే ఇష్టం లేదని, ట్రావెల్ అంటే తనకు ఇష్టమని చెప్పారు.