Roja : రీ ఎంట్రీ మొదటి ఎపిసోడ్ లోనే కామెడీ స్కిట్ వేసిన రోజా.. అత్త పాత్రలో.. ప్రోమో వైరల్..

గతంలో రోజా జబర్దస్త్ లో పలు స్కిట్స్ లో నటించింది.

Roja Re Entry with Drama Juniors Performs Skit First Episode Promo goes Viral

Roja : గతంలో మంత్రిగా ఉన్న సమయంలో టీవీ షోలు కూడా వదిలేసిన రోజా ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. జీ తెలుగులో డ్రామా జూనియర్స్ షో కొత్త సీజన్ మొదలు అయింది. ఈ షోకి సుధీర్ యాంకర్ గా చేస్తుండగా రోజా, డైరెక్టర్ అనిల్ రావిపూడి జడ్జీలుగా చేస్తున్నారు.

తాజాగా డ్రామా జూనియర్స్ మొదటి ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసారు. దీంట్లో రోజా ఓ పాపతో కలిసి స్కిట్ చేసింది. అత్త కోడళ్ల స్కిట్ చేసి నవ్వించారు. అత్త పాత్రలో రోజా నటించింది. బోలెడన్ని పంచులు వేసింది. ఎంట్రీలో డ్యాన్స్ కూడా వేసింది.

Also Read : Rajamouli – Mahesh Babu : రాజమౌళి – మహేష్ సినిమా రిలీజ్ అప్పుడే.. డేట్ కూడా ఫిక్స్ చేసేసారు? ఇంకా ఎన్ని రోజులు ఆగాలంటే..?

గతంలో రోజా జబర్దస్త్ లో పలు స్కిట్స్ లో నటించింది. ఇప్పుడు మళ్ళీ చాన్నాళ్ల తర్వాత రోజా రీ ఎంట్రీ ఇస్తూ స్కిట్ వేయడంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఫుల్ ఎపిసోడ్ రేపు శనివారం ఏప్రిల్ 12 రాత్రి 9 గంటలకు జీ తెలుగులో స్ట్రీమింగ్ కానుంది.

మీరు కూడా రోజా రీ ఎంట్రీలో స్కిట్ వేసిన ఎపిసోడ్ ప్రోమో చూసేయండి..

 

Also Read : Pawan Kalyan : రెడీగా ఉండండి అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం.. ఈసారి ఫిక్స్..