Vijay Devarakonda: రౌడీ హీరో షాకింగ్ లుక్.. ఇదేంటి గురూ!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో స్టార్‌గా మారిన విజయ్ తన యాటిట్యూడ్‌తో, తన సేవా కార్యక్రమాలతో, తన బిజినెస్‌లతో జనాలకి మరింత దగ్గర

Vijay Devarakonda: రౌడీ హీరో షాకింగ్ లుక్.. ఇదేంటి గురూ!

Vijay Devarakonda

Updated On : February 28, 2022 / 5:41 PM IST

Vijay Devarakonda: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో స్టార్‌గా మారిన విజయ్ తన యాటిట్యూడ్‌తో, తన సేవా కార్యక్రమాలతో, తన బిజినెస్‌లతో జనాలకి మరింత దగ్గరయ్యాడు. ఇప్పుడు ‘లైగర్’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోతున్నాడు. ఇప్పటికే విజయ్‌కి అన్ని భాషల్లోనూ అభిమానులు ఉన్న విజయ్.. లైగర్ పూర్తికాగానే పూరితోనే జనగణమన సినిమా మొదలుపెట్టనున్నాడు.

Vijay Devarakonda : విజయ్, రష్మికల పెళ్లి వార్తలు.. సెటైర్ వేస్తూ ఫైర్ అయిన రౌడీ హీరో..

కాగా, లైగర్ కోసం బాడీతో పాటు జుట్టు కూడా పెంచిన విజయ్ రియల్ బాక్సర్ ఎలా ఉంటాడో అదే లుక్ మైంటైన్ చేస్తూ వచ్చాడు. సహజంగానే ఆటిట్యూడ్ లో కాస్త అగ్రెసివ్ చూపించే విజయ్.. లైగర్ సినిమాతో అదే మైంటైన్ చేస్తూ వచ్చాడు. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా విజయ్ డ్రెస్సింగ్ నుండి లుక్ వరకు కాస్త వెరైటీగా.. పక్కా రఫ్ లుక్ లో కనిపించాడు. పబ్లిక్ వేడుకల దగ్గర నుండి మీటింగ్స్ వరకు ఈ మధ్య కాలంలో ఏ ఫోటో చూసినా రౌడీలాగే కనిపించాడు విజయ్.

Vijay Devarakonda: రౌడీ హీరో ఆశలన్నీ లైగర్‌పైనే.. గేమ్ ఛేంజర్ అవుతుందా?

అయితే.. ఇప్పుడు ఓ షాకింగ్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రైమ్ వాలీబాల్ లీగ్-2022 ఫైనల్ కార్యక్రమానికి హాజరైన విజయ్ ఇలా కనిపించి అందరికీ షాక్ ఇచ్చాడు. నిన్నటి వరకు పెంచిన పొడవాటి జుట్టును వదిలిచుకున్న విజయ్ ఇప్పుడు నీట్ గా కనిపించాడు. బాగా షార్ట్ హెయిర్ చేయించిన విజయ్ క్యాప్ ధరించి కనిపించిన ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇప్పటికే లైగర్ షూటింగ్ పూర్తి కాగా త్వరలోనే జనగణమన సినిమా మొదలు పెట్టనున్నారు. ఇందులో విజయ్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడట. బహుశా దానికోసమే ఈ లుక్ ఏమో!