SS Rajamouli Tweets: సినిమా విడుదల వాయిదా వేసుకున్న పవన్ కల్యాణ్‌ను అభినందిస్తున్నా..!

పవన్ కల్యాణ్ ను అభినందించారు. మహేష్ బాబుకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. నిర్మాత దిల్ రాజుకూ ధన్యవాదాలు తెలిపారు. వాళ్ల కొత్త సినిమాల విడుదలను వాయిదా వేసుకోవడంపై రాజమౌళి ఆనందించారు.

SS Rajamouli Tweets: మోస్ట్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియన్ ఫిల్మ్ RRR టీమ్ కు.. లైన్ క్లియర్ అయ్యింది. బడా సినిమాలు తమ విడుదల తేదీని వాయిదా వేసుకోవడంతో.. మ్యాగ్జిమమ్ థియేటర్లలో RRR సినిమా విడుదల కానుంది. అనుకున్న సమయానికే థియేటర్లలోకి వచ్చేస్తాం అంటూ.. ఇన్నాళ్లూ హడావుడి చేసిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ సినిమా టీమ్.. ఓ మెట్టు దిగింది. ఫిబ్రవరిలో తమ సినిమాను విడుదల చేయనున్నట్టు తెలిపింది. ఇదే ఎఫెక్ట్.. ఎఫ్3 సినిమాపైనా పడింది. ఈ మూవీ విడుదలను సైతం వాయిదా వేసుకుంటున్నట్టు చిత్ర నిర్మాత దిల్ రాజు ప్రెస్ మీట్ లో స్వయంగా ప్రకటించారు. దీంతో.. రాజమౌళికి టెన్షన్ తప్పింది. భీమ్లానాయక్, ఎఫ్ 3 సినిమాల పోస్ట్ పోన్ వార్త తెలియగానే.. సంతోషంతో ఆయన వరస పెట్టి ట్వీట్లు చేశాడు. తన సినిమాకు సమస్య తప్పిందన్న ఆనందాన్ని.. ఆ ట్వీట్లతో తెలియజేశాడు. వాయిదా పడిన సినిమాలన్నిటికీ మంచి జరగాలని కోరుతూ.. పోస్టులు పెట్టాడు.

‘భీమ్లా నాయక్ సినిమా విడుదలను వాయిదా వేసుకున్నందుకు.. చినబాబు, పవన్ కల్యాణ్ ను అభినందిస్తున్నా. వారి చిత్రానికి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేశాడు.. రాజమౌళి.

‘ఎఫ్ 3 సినిమా విడుదల వాయిదా వేసిన చిత్ర నిర్మాత దిల్ రాజుకు కూడా నా ధన్యవాదాలు. శుభాకాంక్షలు’ అంటూ ఎఫ్ 3 విడుదల వాయిదాపై రాజమౌళి స్పందించారు.

మహేష్ బాబుతో రాజమౌళి.. తన తర్వాత సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆయనకైతే.. ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాడు రాజమౌళి. సంక్రాంతి బరిలో నిలిచేందుకు మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాటకు అన్ని అర్హతలు ఉన్నాయని అన్నాడు. అయినా.. సినిమాల విడుదలలో ఎవరికీ ఇబ్బంది కలగకుండా మహేష్ బాబు చొరవ చూపి మరీ.. సినిమా విడుదలను సమ్మర్ కు వాయిదా వేయడం.. ఇండస్ట్రీలో ఆరోగ్యకర వాతావరణాన్ని ఏర్పరిచిందని అన్నాడు. ‘నా హీరోకు, మైత్రి మూవీ మేకర్స్ టీమ్ కు థ్యాంక్స్’ అంటూ తన ఆనందాన్ని ట్విటర్ లో రాజమౌళి పంచుకున్నాడు.

Read More:

Bheemla Nayak: వెనక్కు తగ్గిన భీమ్లా నాయక్.. ఫిబ్రవరిలో రిలీజ్

Bheemla Nayak Postpone: ప్యాన్ ఇండియా సినిమాలకు దారిచ్చిన పవన్

F3 Movie: భీమ్లా దెబ్బ.. వాయిదా పడిన ఎఫ్-3!

Sarkaru Vaari Paata : ఏప్రిల్ 1న ‘సర్కారు వారి పాట’

ట్రెండింగ్ వార్తలు