Rrr
RRR Dosti Song : యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామచరణ్ తేజలు ప్రధాన పాత్రల్లో నటించిన RRR మూవీకి సంబంధించిన ఫస్ట్ సాంగ్ వచ్చేస్తోంది. ముగింపు దశలో ఉన్న ఈ ఫిల్మ్ కు సంబంధించిన ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు. ఆగస్టు 1వ తేదీ ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా…ఉదయం 11 గంటలకు ఫస్ట్ సాంగ్ రిలీజ్ చెయ్యబోతున్నారు. ఈ పాట ఎలా ఉంటుందనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
Read More : UK PM Boris Johnson: 57ఏళ్ల వయస్సులో తండ్రి అవబోతున్న పీఎం బోరిస్ జాన్సన్
‘దోస్తీ’ అంటూ ప్రమోషనల్ సాంగ్ కోసం ఐదు భాషల నుంచి ఐదుగురు సింగర్లను దించారు. కీరవాణి సారథ్యంలో ఐదుగురు సింగర్లు హేమచంద్ర, అనిరుధ్, అమిత్ త్రివేది, విజయ్ జేసుదాస్, యాజిన్ నిజర్ ఈ సాంగ్ పాడారు. ఈ మేరకు వదిలిన ఓ ఫొటో నెట్టింట ఓ రెంజ్ లో వైరల్ అయ్యింది. పాడడం ఒకెత్తు అయితే..ప్రమోషన్ లో ఉండడం మరో ఎత్తు అంటూ హేమచంద్ర కామెంట్ చేశారు.
Read More : West Bengal: వితంతువుకు గుండు గీయించి గ్రామ బహిష్కరణ
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఆర్ఆర్ఆర్’ మ్యూజిక్ రైట్స్ టి-సిరీస్, లహరి మ్యూజిక్ సంస్థలు హయ్యెస్ట్ ప్రైజ్‌కి సొంతం చేసుకున్నాయి. ఫైనల్ షెడ్యూల్ యూకేలో ప్లాన్ చేశారు. తారక్, చరణ్, అలియా భట్‌ల మీద ఓ బ్యూటిఫుల్ అండ్ ఎనర్జిటిక్ సాంగ్ పిక్చరైజ్ చెయ్యబోతున్నారు. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం ఆగస్టు 1వ తేదీ హైదరాబాద్ నుండి ఎన్టీఆర్, చరణ్, బాంబే నుండి అలియా అబ్రోడ్ చేరుకుంటారు. ఆగస్టు 2 నుండి షూట్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 13న ‘ఆర్ఆర్ఆర్’ భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.