West Bengal: వితంతువుకు గుండు గీయించి గ్రామ బహిష్కరణ

పశ్చిమబెంగాల్ లోని సౌత్ 24పరగణాస్ కు చెందిన వితంతువుకు గుండు గీయించి గ్రామ బహిష్కరణ చేశారు గ్రామస్థులు. వరుసకు బావ అయ్యే వ్యక్తితో ఎఫైర్ ఉందనే ఆరోపణలతో వారిద్దరికీ శిక్ష విధించారు. జిల్లాలోని క్యానింగ్ పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన జరిగింది.

West Bengal: వితంతువుకు గుండు గీయించి గ్రామ బహిష్కరణ

Women (1)

West Bengal: పశ్చిమబెంగాల్ లోని సౌత్ 24పరగణాస్ కు చెందిన వితంతువుకు గుండు గీయించి గ్రామ బహిష్కరణ చేశారు గ్రామస్థులు. వరుసకు బావ అయ్యే వ్యక్తితో ఎఫైర్ ఉందనే ఆరోపణలతో వారిద్దరికీ శిక్ష విధించారు. జిల్లాలోని క్యానింగ్ పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన జరిగింది.

మూడేళ్ల క్రితం మహిళ భర్త చనిపోగా.. అత్తారింటికి దగ్గర్లో ఇద్దరి కొడుకులతో కలిసి ఉంటుంది. చనిపోయిన భర్తకు అన్న అయిన పరితోష్ సర్దార్, మరికొందరు ఆమెను పెళ్లాడేందుకు ప్రపోజల్ పెట్టారు. వాటన్నిటినీ తోసి పుచ్చడంతో ఆమె ఊరి వదిలి వెళ్లిపోవాలని బెదిరించారు. అదే సమయంలో బావ అయిన ఖుదీరామ్ సర్దార్ సాయం చేసేందుకు ముందుకొచ్చాడు.

పరితోశ్‌తో పాటు మరికొందరు కలిసి వారిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందంటూ పుకార్లు పుట్టించడం మొదలుపెట్టారు. జులై 28 బుధవారం సాయంత్రం 5గంటల సమయంలో.. మహిళను గుండు గీయించి గ్రామ బహిష్కరణ చేశారు. ఆమెతో పాటు ఖుదీరామ్ అనే వ్యక్తిని కూడా వెళ్లగొట్టారు.

ఘోర అవమానానికి గురైన మహిళ.. పరితోశ్ తో పాటు ఏడుగురిపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. నిందితుడితో పాటు మిగిలిన వారిపై ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి ఇద్దరిని అరెస్టు చేశారు.