RRR getting one more international award
RRR : టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన భారీ ముల్టీస్టార్రర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా రికార్డులు మీద రికార్డులు కొల్లగొడుతుంది. ఈ సినిమా భారతదేశ పురస్కారాలు అందుకోవడానికి ముందే అంతర్జాతీయ పురస్కారాలను అందుకుంటూ చరిత్ర సృష్టిస్తుంది. ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ ని అందుకున్న ఈ చిత్రం, ఇప్పుడు మరో అంతర్జాతీయ అవార్డ్స్ లో సత్తా చాటింది.
RRR: జపాన్‌లో తిరుగులేని రికార్డును క్రియేట్ చేసిన ఆర్ఆర్ఆర్.. ఇప్పట్లో కష్టమే!
‘ఫిలడెల్ఫియా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్’ ప్రకటించే అవార్డ్స్ లో మూడు క్యాటగిరీలో విజేతగా నిలిచింది జక్కన్న చెక్కిన RRR సినిమా. ‘బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్’, ‘బెస్ట్ సినిమాటోగ్రఫీ’, ‘బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్’ క్యాటగిరీలో అవార్డులను అందుకుంది. ఈ విషయాన్ని ఫిలీ ఫిల్మ్ క్రిటిక్స్ తమ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దీంతో ఆర్ఆర్ఆర్ టీమ్.. జ్యూరీకి కృతజ్ఞతలు తెలియజేసింది.
కాగా ఎన్ని ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందుకున్నా, రాజమౌళి చూపు మాత్రం ఆస్కార్ పైనే ఉంది. RRR సినిమా ఎలాగైనా ఆస్కార్ బరిలో నిలవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి జక్కన్న కల నెరవేరుతుందో లేదో చూడాలి. అయితే అంతర్జాతీయ వేదికలపైనే ఇన్ని అవార్డులను అందుకుంటున్న ఆర్ఆర్ఆర్ భారతదేశ పురస్కారాల్లో ఇంకెన్ని అవార్డులు అందుకుంటుందో అని లెక్కలు వేస్తున్నారు ఫ్యాన్స్.
Thank you @PhilaFCC for awarding us with 3 Trophies ???!! ?❤ #RRRForOscars #RRRMovie pic.twitter.com/hK41MdHzC0
— RRR Movie (@RRRMovie) December 19, 2022