RRR: జపాన్‌లో తిరుగులేని రికార్డును క్రియేట్ చేసిన ఆర్ఆర్ఆర్.. ఇప్పట్లో కష్టమే!

టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ప్రెస్టీజియస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా వచ్చి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను జపాన్ దేశంలో ఇటీవల భారీ స్థాయిలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను అక్కడ ప్రమోట్ చేసేందుకు ఆర్ఆర్ఆర్ టీమ్ కూడా ఆక్కడికి వెళ్లారు. కాగా ఈ సినిమాకు జపాన్ వాసులు పట్టం కడుతూ వస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి 55 రోజులు దాటినా, అక్కడ కళ్లు చెదిరే వసూళ్లతో దూసుకుపోతుంది.

RRR: జపాన్‌లో తిరుగులేని రికార్డును క్రియేట్ చేసిన ఆర్ఆర్ఆర్.. ఇప్పట్లో కష్టమే!

RRR Becomes India's Biggest Grosser Movie In Japan

RRR: టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ప్రెస్టీజియస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా వచ్చి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను పీరియాడికల్ ఫిక్షన్ కథగా తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను కట్టపడేసింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సెన్సేషనల్ రికార్డును క్రియేట్ చేసింది. ఇంకా ఈ సినిమా గ్లోబల్‌గా పలు అవార్డులు, రివార్డులు అందుకుంటూ సందడి చేస్తూనే ఉంది.

RRR : 24 ఏళ్ళ రజిని రికార్డుని బ్రేక్ చేసిన రాజమౌళి..

అయితే ఈ సినిమాను జపాన్ దేశంలో ఇటీవల భారీ స్థాయిలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను అక్కడ ప్రమోట్ చేసేందుకు ఆర్ఆర్ఆర్ టీమ్ కూడా ఆక్కడికి వెళ్లారు. కాగా ఈ సినిమాకు జపాన్ వాసులు పట్టం కడుతూ వస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి 55 రోజులు దాటినా, అక్కడ కళ్లు చెదిరే వసూళ్లతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ జపాన్ దేశంలో ఏకంగా 450 మిలియన్ యెన్స్ వసూళ్లు సాధించి ఆల్‌టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. అంతేగాక ఈ సినిమాను చూసేందుకు 2 లక్షల 71 ఫుట్ ఫాల్స్ నమోదైనట్లుగా అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారు.

RRR: ‘ఆర్ఆర్ఆర్’కు ప్రెస్టీజియస్ HCA స్పాట్‌లైట్ విన్నర్ అవార్డ్

రెండు దశాబ్దాలుగా జపాన్ దేశంలో రజినీకాంత్ ‘ముత్తు’ సినిమా 400 మిలియన్ యెన్స్‌తో అత్యధిక వసూళ్లు సాధించి, బిగ్గెస్ట్ ఇండియన్ గ్రాసర్‌గా నిలిచింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఆ రికార్డును తుడిచిపెట్టేసింది. ఇక ఇప్పట్లో ఆర్ఆర్ఆర్ రికార్డును తిరగరాయడం కాదుకదా.. దాన్ని టచ్ చేయడం కూడా కష్టమే అంటున్నారు జపాన్‌లోని ఇండియన్ మూవీ లవర్స్. మరి అక్కడ టోటల్ రన్‌లో ఆర్ఆర్ఆర్ ఎలాంటి వసూళ్లతో నిలుస్తుందో చూడాలి.