RRR Movie : RRR మూవీ విడుదల వాయిదా.. రిలీజ్ ఎప్పుడంటే..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం ‘ఆర్ఆర్ఆర్’ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది..

RRR Movie : RRR మూవీ విడుదల వాయిదా.. రిలీజ్ ఎప్పుడంటే..?

Rrr Movie

Updated On : September 11, 2021 / 1:24 PM IST

RRR Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌లను కొమరం భీం, అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్లలో చూపిస్తూ.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్ – రౌద్రం, రణం, రుధిరం’..

RRR Team: గెట్ రెడీ.. గుమ్మడికాయ కొట్టేశారు..

ఇటీవలే బ్యాలెన్స్ ఉన్న రెండు పాటలను ఉక్రెయిన్‌లో షూట్ చేసి.. సినిమాకి గుమ్మడికాయ కొట్టేశారు. దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ చెయ్యాలనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు తెరుచుకున్నా ప్రేక్షకులు రావడం కష్టంగా మారడంతో ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ మీద సస్పెన్స్ కొనసాగుతోంది.

Evaru Meelo Koteeswarulu : రామ్ – భీమ్ ఎపిసోడ్ హయ్యెస్ట్ టీఆర్‌పీ..!

అయితే శనివారం సినిమా టీం సోషల్ మీడియా ద్వారా కొత్త అప్‌డేట్ ఇచ్చారు. అక్టోబర్ 21 నాటికి ‘ఆర్ఆర్ఆర్’ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకునే వరకు విడుదల తేదీని ప్రకటించలేం. త్వరలోనే మీ ముందుకు వస్తాం అని తెలిపారు.