RRR Movie won five awards in Hollywood Critics Association Awards
RRR at HCA : రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన RRR సినిమా గత సంవత్సర కాలంగా సాధిస్తున్న విజయాలు చూస్తూనే ఉన్నాం. ఓ వైపు పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తూ మరో వైపు భారీ కలెక్షన్స్ కొల్లగొట్టి ఇంకో వైపు అంతర్జాతీయ స్థాయిలో అవార్డుల్ని సాధిస్తుంది RRR సినిమా. అంతర్జాతీయ వేదికపై మన సినిమాకి, రాజమౌళికి, చరణ్ ఎన్టీఆర్ లకు అరుదైన గుర్తింపులు దక్కుతున్నాయి.
ఇక RRR సినిమాలోని నాటు నాటు సాంగ్ ఇప్పటికే ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇక ఈ ఆస్కార్ అవార్డు కార్యక్రమంతో పాటు, RRR ని హాలీవుడ్ లో రీ రిలీజ్ చేస్తుండటం, మరిన్ని అవార్డు వేడుకలు ఉండటంతో ఇప్పటికే రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్.. మరికొంతమంది RRR యూనిట్ అమెరికాలోనే ఉంటూ ఆ కార్యక్రమాలలో పాల్గొంటూ RRR ని మరింత ప్రమోట్ చేస్తున్నారు.
తాజాగా RRR సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని అవార్డులు వచ్చాయి. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో RRR సినిమా ఏకంగా అయిదు అవార్డుల్ని కొల్లగొట్టి అనేక హాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టింది. గతంలో డిసెంబర్ లోనే విదేశాల్లోనూ విశేష ప్రజాదరణ పొందిన చిత్రంగా RRR సినిమాకు HCA స్పాట్ లైట్ అవార్డు ప్రకటించారు. అప్పుడే పలు విభాగాల్లో RRR సినిమా నామినేట్ అయింది.
Oscar Crisis Team : 94 ఏళ్ళ ఆస్కార్ చరిత్రలో మొదటిసారి.. విల్ స్మిత్ ఘటన వల్లే..
తాజాగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల కార్యక్రమం శుక్రవారం ఫిబ్రవరి 24 రాత్రి జరిగింది. ఈ అవార్డు వేడుకల్లో RRR సినిమాకు ‘బెస్ట్ స్టంట్స్’, ‘బెస్ట్ యాక్షన్ మూవీ’, ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’(నాటు నాటు), ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్’ విభాగాల్లో అవార్డుల్ని సొంతం చేసుకుంది. దీంతో స్పాట్ లైట్ అవార్డుతో కలిపి మొత్తం హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో అయిదు అవార్డుల్ని RRR సినిమా సొంతం చేసుకుంది. ఈ వార్డులని రాజమౌళి, కీరవాణి అందుకొని ఎమోషనల్ గా స్పీచ్ ఇచ్చి HCA నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి RRR చిత్రయూనిట్ నుంచి రాజమౌళి, రామ్ చరణ్, కీరవాణి, కార్తికేయ హాజరయ్యారు.
Yay!! Thank you @HCAcritics ???? #RRRMovie https://t.co/6GE5eFI7yQ
— RRR Movie (@RRRMovie) February 25, 2023
?? #NaatuNaatu #RRRMovie ? https://t.co/PDUaqF9wsY
— RRR Movie (@RRRMovie) February 25, 2023
????? BEST ACTION FILM GOES TO…… #RRRMovie #HCAFilmAwards https://t.co/R21HIyDIer
— RRR Movie (@RRRMovie) February 25, 2023
BEST INTERNATIONAL FILM GOES TO…. #RRRMovie ❤️?#HCAFilmAwards https://t.co/QeTd3SorGo
— RRR Movie (@RRRMovie) February 25, 2023
The cast and crew of #RRR will be the recipient of this year’s HCA Spotlight Award. #HCAFilmAwards #RRRMovie pic.twitter.com/QwHQQ2RY1R
— Hollywood Critics Association (@HCAcritics) December 5, 2022