బాహుబలిని మించి : RRR పాన్ ఇండియా మూవీ
ఆర్ ఆర్ ఆర్ పాన్ ఇండియా సినిమా..

ఆర్ ఆర్ ఆర్ పాన్ ఇండియా సినిమా..
బాహుబలి : ది బిగినింగ్, బాహుబలి : ది కన్‌క్లూజన్ సినిమాలతో తెలుగు సినిమా స్టామినాని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాడు.. దర్శకధీరుడు.. ఎస్.ఎస్.రాజమౌళి. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఒక సినిమా రూపొందిస్తున్నాడు జక్కన్న. ఆర్ ఆర్ ఆర్ (వర్కింగ్ టైటిల్) ఈ సినిమాకి సంబంధించి రోజుకో గాసిప్ పుట్టుకొస్తుంది. కానీ, రాజమౌళి వాటిపై రెస్పాండ్ కాలేదు. రీసెంట్‌గా తన అప్ కమింగ్ మూవీ గురించి మాట్లాడాడు రాజమౌళి. హార్వర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన ఈవెంట్‌లో రాజమౌళి దంపతులు పాల్గొన్నారు. ఫిల్మ్ మేకింగ్ స్టైల్ గురించి చెప్తూ, ఆర్ ఆర్ ఆర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు రాజమౌళి. ఆర్ ఆర్ ఆర్ పాన్ ఇండియా సినిమా.. ఎందుకంటే కథ ఆ రేంజ్‌లో ఉంటుంది..
బాహుబలికంటే ఎన్నో రెట్లు గొప్పగా ఈ సినిమాని రూపొందిస్తున్నాం.. అని చెప్పాడు. ఆర్ ఆర్ ఆర్‌ని ఫాంటసీ సినిమాగా తీస్తున్నారా? అని అడిగితే, ఇంతకు మించి ఇప్పుడేం అడగకండి.. అని నవ్వేసాడు.. డి.వి.వి.దానయ్య ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఎమ్.ఎమ్.కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. హీరోయిన్లుగా బాలీవుడ్ భామలు పరిణీతి చోప్రా, అలియా భట్ పేర్లు వినిపిస్తున్నాయి.