‘నా తమ్ముడు.. గోండు వీరుడు.. కొమురం భీం..’ అంటూ గర్జించిన రామరాజు..

#RamarajuForBheem: మల్టీస్టారర్ మూవీ RRR చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ పోటాపోటీగా నటిస్తున్నారు అనే దానికి నిదర్శనం టీం విడుదల చేసిన రెండు టీజర్లు.. మెదట విడుదల చేసిన టీజర్‌లో ఒళ్ళు గుళ్ళ చేసుకునేలా వ్యాయామం చేస్తూ విల్లుని తన సిక్స్ ప్యాక్ బాడీతో రామ్ చరణ్ ఎక్కుపెట్టిగా.. అతని పాత్రను పరిచయం చేస్తూ తారక్ వాయిస్ అందించి ‘‘నా అన్న సీతారామరాజు.. ఇంటి పేరు అల్లూరి’’… అంటూ గర్జించాడు.
ఇప్పడు అదే ఊపులో అక్టోబర్ 22న తెలంగాణ గోండు వీరుడు కొమురం భీం 119వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో తారక్ ఏమాత్రం తగ్గకుండా తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. మెదట వాటర్ లో బల్లెం తీసి.. తన సిక్స్ బాడీని రక్తపు చుక్కలతో చూపించాడు.
https://10tv.in/rrr-digital-and-satellite-rights-sold-for-a-whopping-200-crore-for-popular-channel/
దీనికి ఇప్పడు రామ్ చరణ్ వాయిస్ ఇస్తూ.. ‘‘వాడు కనబడితే సముద్రాలు తడబడతాయ్..నిలబడితే సామ్రాజ్యాలు సాగిలపడతాయ్..వాడి పొగరు.. ఎగిరే జెండా..వాడి ధైర్యం చీకట్లని చీల్చే మండుటెండ..వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దు బిడ్డ.. నా తమ్ముడు.. గోండు వీరుడు.. కొమురం భీం’’.. అంటూ పిచ్ పెంచుతూ గర్జించాడు. ఇదే ఈ టీజర్ కి హైలెట్ గా నిలిచింది.
ఈ చిత్రాన్ని ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ దశాబ్దానికే ఇది మోస్ట్ క్రేజియెస్ట్ ఫిల్మ్ గా 2021 లో విడుదలకి సిద్దమవుతోంది ‘‘ఆర్ఆర్ఆర్- రౌద్రం రణం రుధిరం’’..