RRR: మ్యాచ్ మధ్యలో కోహ్లీ ‘నాటు’ స్టెప్పు.. అదిరిపోయిందంటూ ట్వీట్ చేసిన ట్రిపుల్ ఆర్!
యావత్ ప్రపంచ దృష్టిని ‘నాటు నాటు’ పాటతో తనవైపుకు తిప్పుకుంది ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ప్రతిష్టాత్మకమైన 95వ ఆస్కార్ అవార్డు రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ పాటకు స్టెప్పులేస్తున్నారు. ఇక ‘నాటు నాటు’ ఆస్కార్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డును దక్కించుకోవడంతో, ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్ ఆర్ఆర్ఆర్ టీమ్‌ను అభినందనలతో ముంచెత్తుతున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అన్ని రంగాలకు చెందిన వారు ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

RRR Tweets Video Of Virat Kohli Naatu Naatu Step In IND Vs AUS Match
RRR: యావత్ ప్రపంచ దృష్టిని ‘నాటు నాటు’ పాటతో తనవైపుకు తిప్పుకుంది ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ప్రతిష్టాత్మకమైన 95వ ఆస్కార్ అవార్డు రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ పాటకు స్టెప్పులేస్తున్నారు. ఇక ‘నాటు నాటు’ ఆస్కార్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డును దక్కించుకోవడంతో, ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్ ఆర్ఆర్ఆర్ టీమ్‌ను అభినందనలతో ముంచెత్తుతున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అన్ని రంగాలకు చెందిన వారు ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
RRR : ఆస్కార్‌తో హైదరాబాద్‌లో అడుగుపెట్టిన RRR టీం.. జై హింద్ అంటూ రాజమౌళి..
అయితే తాజాగా, భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తనదైన స్టయిల్‌లో ఆర్ఆర్ఆర్ టీమ్‌కు అభినందనలు తెలిపాడు. తాజాగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా తొలి వన్డే మ్యాచ్‌లో కోహ్లీ మైదానంలో ‘నాటు నాటు’ స్టెప్పు వేస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇలా తమ దేశానికి గర్వకారణమైన సాంగ్‌కు తనదైన స్టయిల్‌లో విరాట్ కోహ్లీ స్టేడియంలో డ్యాన్స్ చేయడం ఇప్పుడు వైరల్‌గా మారింది.
RRR : నాటు నాటు సాంగ్ గురించి చంద్రబోస్‌తో టామ్ క్రూజ్ ఏమన్నాడో తెలుసా?
ఇక దీనికి సంబంధించిన వీడియోను ఆర్ఆర్ఆర్ టీమ్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది. విరాట్ కోహ్లీ చేసిన ఈ డ్యాన్స్ అధ్బుతం అంటూ ఇమోజీలను పెట్టి రియాక్ట్ అయ్యింది చిత్ర యూనిట్. మరి విరాట్ చేసిన ఈ డ్యాన్స్ స్టెప్ ఎలా ఉందో మీరూ ఓసారి లుక్కేయండి.
.@imVkohli ?? #NaatuNaatu ? pic.twitter.com/6jjZhH7fh2
— RRR Movie (@RRRMovie) March 17, 2023