RRR : నాటు నాటు సాంగ్ గురించి చంద్రబోస్‌తో టామ్ క్రూజ్ ఏమన్నాడో తెలుసా?

నాటు నాటు ఆస్కార్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఈవెంట్ లో వరల్డ్ టాప్ మోస్ట్ హీరో టామ్ క్రూజ్ ని చంద్రబోస్ కలుసుకున్నాడు. టామ్ క్రూజ్ నాటు నాటు గురించి చంద్రబోస్‌తో..

RRR : నాటు నాటు సాంగ్ గురించి చంద్రబోస్‌తో టామ్ క్రూజ్ ఏమన్నాడో తెలుసా?

Tom Cruise comments on naatu naatu song and RRR with chandrabose

Updated On : March 16, 2023 / 7:00 PM IST

RRR : రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలన సృష్టించిందో ఇంకా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుని నాటు నాటు సాంగ్ అందుకోవడమే కాకుండా, ఆ వేడుకల్లో మన తెలుగు పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వరల్డ్ లోని టాప్ స్టార్స్ అంతా పాల్గొనే ఈ వేడుకకు RRR టీం నుంచి మూవీ నుంచి రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్, సెంథిల్ కుమార్, కీరవాణి, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్ మాస్టర్, కార్తికేయతో పాటు ఫ్యామిలీ మెంబెర్స్ కూడా హాజరయ్యారు.

RRR : RRR సీక్వెల్ పనులు వేగవంతం చేసాం.. అమెరికన్ మీడియాతో రాజమౌళి!

ఇక అమెరికా నుంచి తిరిగి వచ్చిన చంద్రబోస్ ఇక్కడ మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే అక్కడ జరిగిన పలు సంఘటలను ఇక్కడి ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఆస్కార్ ఈవెంట్ లో వరల్డ్ టాప్ మోస్ట్ హీరో టామ్ క్రూజ్ ని చంద్రబోస్ కలుసుకున్నాడు. ఆ విషయాన్ని చెబుతూ.. ”నా పక్క టేబుల్ లో టామ్ క్రూజ్ ఉండడం గమనించి ఆయన దగ్గరికి వెళ్లి, ఆయన్ని పలకరించి. నేను RRR లోని నాటు నాటు సాంగ్ రాసిన రైటర్ ని అని పరిచయం చేసుకున్నాను. అది విన్న టామ్ క్రూజ్.. వావ్, ఐ లవ్ RRR. ఐ లవ్ నాటు నాటు అంటూ చెప్పారు.

టామ్ క్రూజ్ వంటి అంతర్జాతీయ స్టార్ నోటి నుంచి నాటు నాటు పదం వినడమే గొప్ప. అలాంటిది ఆయన దాని ఇష్టపడ్డాను అని చెబుతుంటే చాలా సంతోషం వేసింది. అలాగే ఆ వరుసలోనే స్టీవెన్ స్పీల్‌బెర్గ్ ఉంటే ఆయన్ని కలిశాను. ఆయన మాట్లాడుతూ.. నా భార్య RRR ని రెండుసార్లు చూసింది అంటూ చెప్పారు” అని అక్కడ విషయాలను చెప్పుకొచ్చాడు. కాగా ఆస్కార్ అందుకున్న తరువాత చంద్రబోస్ అమెరికా మీడియాతో తెలుగు భాష తియ్యదనాన్ని, గొప్పతనాన్ని తెలియజేశాడు.