Ruchi Gujjar : నిర్మాతను చెప్పుతో కొట్టిన నటి.. మోదీ నక్లెస్ తో పాపులర్ అయిన భామ..

రుచి గుజ్జర్ బాలీవుడ్ నిర్మాత, నటుడు మాన్ సింగ్ ని చెప్పుతో కొట్టింది.

Ruchi Gujjar

Ruchi Gujjar : నటి రుచి గుజ్జర్ బాలీవుడ్ నిర్మాత, నటుడు మాన్ సింగ్ ని చెప్పుతో కొట్టింది. మాన్ సింగ్ నటించి నిర్మించిన ఓ సినిమా నిన్న జులై 25న రిలీజయింది. ఈ క్రమంలో ఓ స్పెషల్ షోకి వచ్చారు. అక్కడకు నటి రుచి గుజ్జర్ కూడా వచ్చింది. తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలని అతన్ని తిడుతూ తన కాలికి ఉన్న చెప్పు తీసి మాన్ సింగ్ ని కొట్టింది. దీంతో అక్కడ ఉన్న వాళ్ళు వెంటనే అలెర్ట్ అయి ఆమెని అడ్డుకున్నారు. అలాగే మాన్ సింగ్ గాడిద మీద కూర్చున్నట్టు కొన్ని ఫ్లకార్డులు ప్రదర్శించింది రుచి టీమ్. దీంతో రుచి నిర్మాతని చెప్పుతో కొట్టిన వీడియోలు వైరల్ గా మారాయి.

రుచి అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మ్యూజిక్ ఆల్బమ్ కు సంబంధించి మాన్ సింగ్ నాకు 25 లక్షలు ఇవ్వాలి. అవి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాను అని తెలిపింది.

Also Read : NTR Remuneration : వాట్.. హృతిక్ కంటే ఎన్టీఆర్ కే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చారా? వార్ 2 లో ఎవరికి ఎంత రెమ్యునరేషన్..?

రుచి గుజ్జర్ రాజస్థాన్ కి చెందిన మోడల్. 2023 లో మిస్ హర్యానా గా నిలిచిన రుచి గుజ్జర్ తర్వాత మోడలింగ్ చేస్తూ బాలీవుడ్ లో పలు ప్రైవేట్ వీడియో సాంగ్స్ లో నటించింది. ప్రస్తుతం ప్రైవేట్ సాంగ్స్ చేస్తూనే బాలీవుడ్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తుంది. ఇటీవల కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఇండియా తరపున పాల్గొని అక్కడ మోదీ లాకెట్స్ ఉన్న నక్లెస్ వేసుకొని వైరల్ అయింది రుచి.

 

Also Read : Vishwambhara : మెగాస్టార్ తో ‘విశ్వంభర’లో స్టెప్పులేసే స్పెషల్ భామ ఎవరో తెలుసా? బాలీవుడ్ నుంచి దించారుగా..