Rudramkota : శ్మశాన వాటికలో పెరిగిన యువకుడి ప్రేమకథే ‘రుద్రంకోట’.. సెప్టెంబర్ 22న విడుదల..
శ్మశాన వాటికలో పెరిగి పెద్దైన ఓ యువకుడి ప్రేమకథతో తెరకెక్కిన 'రుద్రంకోట'..

Rudramkota movie with new concept love story in this september
Rudramkota : సీనియర్ నటి జయలలిత సమర్పకులుగా వ్యవహిరిస్తూ ఓ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రుద్రంకోట’. ఏఆర్ కె విజువల్స్ పతాకంపై రాము కోన దర్శకత్వంలో అనిల్ ఆర్కా కండవల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్, విభీష, రియా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 22న స్క్రీన్ మాక్స్ పిక్చర్స్ సంస్థ ద్వారా వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదలకు సిద్ధమవుతోంది.
Vijay Deverakonda : విజయ్ దేవరకొండకు తమిళనాడులో ఇంతటి క్రేజ్ ఉందా..? ఈ ఏడాది రికార్డు..
ఈ సందర్భంగా హీరో, నిర్మాత అనిల్ ఆర్క కండవల్లి మాట్లాడుతూ.. “శ్మశాన వాటికలో పెరిగి పెద్దైన ఓ యువకుడి ప్రేమకథా చిత్రమిది. భద్రాచలం దగ్గర రుద్రంకోట అనే ఊరి నేపథ్యంలో కథ నడుస్తుంది. ఇప్పటి వరకు ఎవరూ చూపించని అంశాలను మా చిత్రంలో చూపిస్తున్నాము. ఇందులో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలుంటాయి. సీనియర్ నటి జయలలిత గారు సమర్పకులుగా వ్యవహరిస్తూ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించారు. ప్రముఖ సంగీత దర్శకులు కోటి గారు మా చిత్రానికి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. సుభాష్ ఆనంద్ అందించిన రెండు పాటలు ఇప్పటికే విడుదలై ప్రజాదరణ పొందాయి. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ ప్రముఖులు యుబైఏ సర్టిఫికెట్ తో పాటు సినిమా బావుందంటూ ప్రశంసించారు. మా సినిమా నచ్చడంతో స్క్రీన్ మాక్స్ పిక్చర్స్ వారు విడుదల చేయడానికి ముందుకొచ్చారు. సెప్టెంబర్ 22న వరల్డ్ వైడ్ గా సినిమాను గ్రాండ్ గా విడుదల చేయనున్నాం” అన్నారు.
Shah Rukh Khan : కథ నచ్చి కాదు.. మరో కారణంతో ‘జవాన్’ని షారుఖ్ ఒకే చేశాడట..
సీనియర్ నటి జయలలిత, ఆలేఖ్య, బాచి, రమ్య తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి డిఓపీ ఆదిమల్ల సంజీవ్, సంగీతం సుభాష్ ఆనంద్ అండ్ నిరంజన్, ఎడిటర్ ఆవుల వెంకటేష్, కొరియెగ్రఫీ కీర్తి శేషులు శివశంకర్ మాస్టర్ అండ్ సుచిత్ర చంద్రబోస్, ఫైట్స్ జాషువా, డైలాగ్స్ రంగ, లిరిక్స్ సాగర్, డిజైనర్ వివా రెడ్డి పనిచేశారు. అనిల్ ఆర్కా కండవల్లి నిర్మాతగా వ్యవహరించగా స్టోరి-స్క్రీన్ ప్లే-దర్శకత్వం రాము కోన చేశారు.

Rudramkota movie with new concept love story in this september

Rudramkota movie with new concept love story in this september