Saindhav: సైంధవ్ కోసం ‘హిట్’ భామను పట్టుకొచ్చిన శైలేష్..!
విక్టరీ వెంకటేష్ నటిస్తున్న ‘సైంధవ్’ మూవీలో డాక్టర్ రేణు అనే పాత్రలో రుహాని శర్మ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

Ruhani Sharma As Dr Rupa In Venkatesh Saindhav Movie
Saindhav: విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను హిట్, హిట్-2 చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతుండటంతో ఈ సినిమా నుండి వరుసగా అప్డేట్స్ ఇస్తూ చిత్ర యూనిట్ సందడి చేస్తోంది.
Saindhav: సైంధవ్ నుండి సాలిడ్ అప్డేట్.. రేణు వస్తోందట!
ఇటీవల ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న శ్రద్ధా శ్రీనాథ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమాలో డాక్టర్ రేణు అనే పాత్రలో నటిస్తున్న మరో హీరోయిన్ రుహాని శర్మకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో రుహాని పాత్ర చాలా కీలకంగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. కాగా, ఈ సినిమా కోసం తన తొలి సినిమా హీరోయిన్ రుహానిని తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని దర్శకుడు శైలేష్ కొలను అన్నాడు.
Saindhav : వెంకీ మామ అప్డేట్స్ విషయంలో అసలు తగ్గేదేలే అంటున్నాడు..
ఈ సినిమాను పూర్తి స్పై థ్రిల్లర్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోండగా, ఈ సినిమాలో వెంకటేష్ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోండగా, ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధీఖి ఈ సినిమాలో విలన్ పాత్రలో నటస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది.
Super excited to be collaborating with my first heroine again 🙂
Introducing @iRuhaniSharma as
Dr. Renu from #SAINDHAV ?#SaindhavOnDec22 @VenkyMama @Nawazuddin_S @ShraddhaSrinath @vboyanapalli @Music_Santhosh @maniDop @NeerajaKona @tkishore555 @NiharikaEnt #Venky75 pic.twitter.com/NYUMB5ltFp— Sailesh Kolanu (@KolanuSailesh) April 21, 2023