HER Movie : పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా HER.. సరిగమ చేతికి ఆడియో రైట్స్!

HIT మూవీతో టాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రుహాణి శర్మ.. ఇప్పుడు HER డిఫరెంట్ కాన్సెప్ట్ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

HER Movie : పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా HER.. సరిగమ చేతికి ఆడియో రైట్స్!

Ruhani Sharma HER suspense movie is ready to release

Updated On : May 30, 2023 / 6:37 PM IST

Ruhani Sharma HER : చిలసౌ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి యూత్ ఆడియన్స్ మనసు దోచుకున్న రుహాణి శర్మ (Ruhani Sharma).. HIT మూవీతో టాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ పరంగా వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు HER డిఫరెంట్ కాన్సెప్ట్ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియో హక్కులను ప్రముఖ ఆడియో సంస్థ సరిగమ సొంతం చేసుకుంది.

Allu Sirish : టెడ్డి బేర్‌తో అల్లు శిరీష్ యాక్షన్.. కొత్త కాన్సెప్ట్‌తో గ్లింప్స్ అదిరిపోయింది!

రీసెంట్ గానే నాచురల్ స్టార్ నాని (Nani) చేతుల మీదుగా ఈ సినిమా టీజర్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ టీజర్ లో రుహాణి శర్మ క్యారెక్టర్ హైలైట్ అయింది. ఆమె ఓ చాలెంజింగ్ రోల్ చేసిందని వీడియోలోని సన్నివేశాలు ప్రూవ్ చేశాయి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో శ్రీధర్ స్వరగావ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Ram Charan : రామ్‌చరణ్‌ సినిమా అయితేనే థియేటర్‌కి వెళ్తా.. ఆ మూవీ నుంచి తనకి ఫ్యాన్ అయ్యిపోయా.. తేజ!

డబుల్ అప్ మీడియాస్ సంస్థ ఫస్ట్ ప్రొడక్షన్ గా ఈ సినిమాను రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి నిర్మించారు. విష్ణు బేసి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. చాణక్య తూరుపు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. పవన్ బాణీలు కడుతున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ చేసిన చిత్రయూనిట్ అతిత్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.