Rules Ranjan : రూల్స్ రంజన్ రిలీజ్ డేట్ ఫిక్స్‌.. ప్ర‌భాస్‌తో పోటీనా..?

టాలీవుడ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం (Kiran Abbavaram) గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఆయ‌న న‌టిస్తున్న చిత్రం రూల్స్ రంజన్ (Rules Ranjann)‌.

Rules Ranjan : రూల్స్ రంజన్ రిలీజ్ డేట్ ఫిక్స్‌.. ప్ర‌భాస్‌తో పోటీనా..?

Rules Ranjan

Rules Ranjan Release Date : టాలీవుడ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం (Kiran Abbavaram) గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వైవిధ్య‌మైన చిత్రాల‌ను చేసుకుంటూ ముందుకు పోతున్నాడు. తాజాగా ఆయ‌న న‌టిస్తున్న చిత్రం ‘రూల్స్ రంజన్’ (Rules Ranjann)‌. రత్నం కృష్ణ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో నేహా శెట్టి క‌థానాయిక‌. నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాత. అమ్రిష్ గణేష్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Pushpa 2 : పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్‌కి 1000 కోట్లు ఆఫర్ చేశారా..?

తాజాగా ఈ చిత్ర విడుద‌ల తేదీని ప్ర‌క‌టించారు. ఈ సినిమాని సెప్టెంబ‌ర్ 28న విడుద‌ల చేస్తున్న‌ట్లు చిత్ర బృందం తెలియ‌జేసింది. ఈ విష‌యాన్ని ఓ కొత్త పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. ఈ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది. వెన్నెల కిషోర్, హైపర్ ఆది, వైవా హర్ష, నెల్లూరు సుదర్శన్, సుబ్బరాజు, అజయ్, గోపరాజు రమణ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్నూ కపూర్, సిద్ధార్థ్ సేన్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, అభిమన్యు సింగ్ మరియు గుల్షన్ పాండే సహా పలువురు హిందీ నటులు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా దులీప్ కుమార్, ఆర్ట్ డైరెక్టర్ గా ఎం.సుధీర్ వ్యవహరిస్తున్నారు.

Music Director Dasi : ప్రమాదంలో ప్రముఖ సంగీత దర్శకుడు మృతి..

ఇదిలా ఉంటే.. అదే రోజు (సెప్టెంబ‌ర్ 28న‌) యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన స‌లార్ సినిమా రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. గ‌త కొద్ది రోజులుగా స‌లార్ చిత్రం వాయిదా ప‌డ‌నుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. స‌లార్ చిత్ర బృందం ఈ వార్త‌ల‌పై ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు. ఇప్పుడు కిర‌ణ్ అబ్బ‌వ‌రం చిత్రం అదే రోజు వ‌స్తుండ‌డంతో ప్ర‌భాస్ స‌లార్ చిత్రం రిలీజ్ దాదాపు వాయిదా ప‌డిన‌ట్లేన‌ని అంటున్నారు.