నిర్మాత – బాబూ కథ వినండి.. మహేష్ : ముందు నా కండీషన్లు వినండి..

మహేష్ బాబుతో సినిమా చెయ్యాలంటే మినిమం రూ.100 కోట్లు ఉండాల్సిందే అని ఫిలింనగర్ టాక్..

  • Published By: sekhar ,Published On : January 27, 2020 / 12:25 PM IST
నిర్మాత – బాబూ కథ వినండి.. మహేష్ : ముందు నా కండీషన్లు వినండి..

Updated On : January 27, 2020 / 12:25 PM IST

మహేష్ బాబుతో సినిమా చెయ్యాలంటే మినిమం రూ.100 కోట్లు ఉండాల్సిందే అని ఫిలింనగర్ టాక్..

మహేష్ బాబు ఒక సినిమాకి ఓకే చెప్పాలంటే మినిమం రూ.100 కోట్లు ఉండాల్సిందే. అవును మరి.. సూపర్ స్టార్ సినిమా అంటే మాటలా.. బాబు గారి రెమ్యూనరేషన్‌తో పాటు బాబు గారికి నచ్చిన టెక్నీషియన్లు, మెచ్చిన మ్యూజిక్ డైరెక్టర్లు, ప్రొడక్షన్లు, ప్రమోషన్లు, మాటలా.. అంతే మరి.. ఆ మాత్రం ఉండాల్సిందే అంటున్నాడు మహేష్ బాబు. మహేష్ ముచ్చట విని.. బాబు గారి బడ్జెట్‌కి భయపడిపోయి ఓ స్టార్ ప్రొడ్యూసర్ ఈ మధ్య అలాగే పారిపోయాడు. 

వివరాళ్లోకి వెళ్తే.. మహేష్ బాబు.. టాలీవుడ్‌లో బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్‌లతో ఫుల్‌ఫామ్‌లో ఉన్నాడు. లేటెస్ట్‌గా సంక్రాంతికి ‘‘సరిలేరు నీకెవ్వరు’’ సినిమాతో సూపర్ హిట్ ఇచ్చి బాక్సాఫీస్ బాస్ అయ్యాడు.అనిల్ రావిపూడి దర్శకత్వంలో రష్మిక హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఆర్మీ మేజర్ రోల్ ప్లే చేసి ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేశాడు మహేష్ బాబు. ఇలా వరుస హిట్లతో ఫామ్‌లో ఉన్న సూపర్ స్టార్‌తో సినిమా చెయ్యాలని ఎవరు అనుకోరు..? అలా బాబు సినిమాలకు బాక్సాఫీస్‌లు బద్దలయిపోయే లాభాలొస్తున్నాయని లేటెస్ట్‌‌గా సంక్రాంతికి సూపర్ హిట్ కొట్టిన ఓ పెద్ద ప్రొడ్యూసర్ మహేష్‌తో సినిమా చేద్దామని  అడ్వాన్స్ ఇచ్చాడు.. ఆ బడా నిర్మాతతో సినిమాకు మహేష్ డేట్స్ కూడా ఇచ్చేశాడు.. బాగానే ఉంది.. 

తీరా సినిమా సిట్టింగులు స్టార్ట్ చేసే టైమ్‌కి మహేష్ బాబు కండిషన్స్ మొదలుపెట్టాడు. నాకు 50 కోట్లు, నాకు నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్‌కి ఓ 10 కోట్లు, నన్ను అందంగా చూపించే డీఓపీకి, ఆర్ట్ డైరెక్టర్‌కి, మేకప్‌లకీ, ప్రొడక్షన్లకీ, ప్రమోషన్లకీ ఇలా.. అన్నీ కలిపి రూ.100 కోట్లకు పైగా ఖర్చు లిస్ట్ అవుట్ చేసి చెప్పిందట సూపర్ స్టార్  కాంపౌండ్. ముందు కథ ఫైనల్ చెయ్ బాబు.. ఖర్చు సంగతి తర్వాత చూద్దాం.. అని ఆ పెద్ద నిర్మాత అంటే, అబ్బే..అలా కుదరదు.. ఫస్ట్ కండిషన్లు ఒప్పుకోండి.. కథ దేముంది.. తర్వాత చూద్దాం అన్నారట.

ఆ దెబ్బతో ప్రొడ్యూసర్ కథ వింటేనే గానీ కండిషన్లకు ఒప్పుకోను అంటే.. ఇలా అయితే బాబు మీతో సినిమా చెయ్యడం కష్టం అని చెప్పిందట మహేష్ క్యాంప్. అయినా సరే ఆ ప్రొడ్యూసర్.. సూపర్ స్టార్ కన్నా స్టోరీయే ముఖ్యం అని.. మహేష్‌కి ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి తీసుకున్నాడట. ఇలా మహేష్ బాబు తనతో సినిమా చేద్దామని వచ్చిన ప్రొడ్యూసర్లకు కండిషన్లతో చుక్కలు చూపిస్తున్నాడని టాలీవుడ్‌లో టాక్ విపరీతంగా నడుస్తోంది. మరి ఈ వార్తల గురించి మహేష్ కాంపౌండ్ ఎలా స్పందిస్తుందో చూడాలిమరి.