Tuk Tuk : ఓటీటీలో దూసుకుపోతున్న చిన్న సినిమా.. స్కూటర్ లో ఉండే ఆత్మ ఎవరిది?

థియేటర్స్ లో మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా మెప్పిస్తుంది.

Saanvi Meghana Tuk Tuk Movie getting Good Response in Amazon Prime OTT

Tuk Tuk : హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోధాటి.. ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘టుక్ టుక్’. చిత్రవాహిని ప్రొడక్షన్స్, RYG సినిమాస్ బ్యానర్స్ పై రాహుల్ రెడ్డి నిర్మాతగా సి.సుప్రీత్‌ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. టుక్ టుక్ మార్చ్ 21న థియేటర్స్ లో రిలీజవ్వగా ఇటీవల అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజయింది.

థియేటర్స్ లో మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా మెప్పిస్తుంది. అమెజాన్ ట్రెండింగ్‌లో టుక్ టుక్ సినిమా నంబర్ 3 స్థానాన్ని సాధించింది. అలాగే ఇప్పటివరకు ఈ సినిమాకు 100 మిలియన్‌కు పైగా వ్యూస్‌ వచ్చి ఓటీటీలో మంచి విజయం సాధించింది. కొత్తవాళ్లు, చిన్న నటీనటులతో తీసిన మంచి ఎమోషనల్ కామెడీ సినిమా టుక్ టుక్ ఓటీటీలో చూసేయండి.

Also Read : Bandla Ganesh : నాకు 40 లక్షలు నష్టం వచ్చింది.. వాళ్ళు స్పీడ్ గా సినిమాలు చేయకపోవడం వల్లే.. బండ్ల గణేష్ వ్యాఖ్యలు వైరల్..

టుక్ టుక్ కథ విషయానికొస్తే.. ఓ పల్లెటూళ్ళో ముగ్గురు టీనేజర్లు(హర్ష్ రోషన్, కార్తీక్ దేవ్, స్టీవెన్ మధు) కెమెరా కొనడానికి డబ్బులు ట్రై చేస్తారు. వినాయకచవితి చందాలు వసూలు చేసి, బొమ్మ పెట్టి మిగిలిన డబ్బులతో కొనుక్కోండి అనే ఐడియా చెప్పడంతో అదే చేస్తారు ఈ ముగ్గురు. ఆ వినాయకుడిని ఊరేగించి తీసుకెళ్లడానికి వీళ్ళ దగ్గర ఓ పాత స్కూటర్ ఉంటే దాన్ని మూడు చక్రాల బండి(టుక్ టుక్)గా మార్చి నిమజ్జనం చేస్తారు. ఆ తెల్లారి నుంచి బండి అదే కదలడం, అదే నడవడం చేస్తుంది. వీళ్ళు అడిగే ప్రశ్నలకు అవును, కాదు అని హ్యాండిల్ అటు ఇటు ఊపుతూ సమాధానాలు ఇస్తుంది. దీంతో మొదట దేవుడు అనుకుంటారు, కానీ ఆ టుక్ టుక్ లో ఒక ఆత్మ ఉందని తెలుస్తుంది. దీంతో ఆ ముగ్గురు భయపడతారు. ఇంతకీ స్కూటర్ లో ఉండే ఆ ఆత్మ ఎవరిది? స్కూటర్ లో ఎందుకు ఉంది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Also Read : Pawan Kalyan : తన సినిమా అయినా రూల్ రూలే.. ‘హరిహర వీరమల్లు’తోనే కొత్త రూల్ మొదలు..