Bandla Ganesh : నాకు 40 లక్షలు నష్టం వచ్చింది.. వాళ్ళు స్పీడ్ గా సినిమాలు చేయకపోవడం వల్లే.. బండ్ల గణేష్ వ్యాఖ్యలు వైరల్..

థియేటర్స్ కి నష్టాలు అంటూ బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు.

Bandla Ganesh : నాకు 40 లక్షలు నష్టం వచ్చింది.. వాళ్ళు స్పీడ్ గా సినిమాలు చేయకపోవడం వల్లే.. బండ్ల గణేష్ వ్యాఖ్యలు వైరల్..

Bandla Ganesh Sensational Comments on Directors and Heros Regarding Theaters Losses

Updated On : June 2, 2025 / 4:53 PM IST

Bandla Ganesh : బండ్ల గణేష్ తన కామెంట్స్ తో అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తారని తెలిసిందే. తాజాగా నిన్న ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టిన రోజు వేడుకలకు బండ్ల గణేష్ హాజరయ్యారు. ఈ ఈవెంట్లో బండ్ల గణేష్ హీరోలు, డైరెక్టర్స్ సినిమాలు ఫాస్ట్ గా చేయకపోవడం వల్లే థియేటర్స్ కి నష్టాలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ఎస్వీ కృష్ణారెడ్డి వినోదం సినిమాను 80 రోజుల్లో పూర్తిచేసి రిలీజ్ చేసేసారు. అలా చాలా తక్కువ రోజుల్లో సినిమాలు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు డైరెక్టర్స్, హీరోలు ఒక్కో సినిమాకు మూడు నాలుగేళ్లు తీసుకుంటున్నారు. ఒక థియేటర్ ఓనర్ గా నేను నా సొంత థియేటర్ కి వెళ్లి ఇటీవల బ్యాలెన్స్ షీట్ చెక్ చేసుకుంటే 40 లక్షలు నష్టం వచ్చింది. గతంలో థియేటర్ నుంచి చాలా డబ్బులు వచ్చేవి. ఇప్పుడు కేవలం పెద్ద సినిమాలు ఎక్కువగా రిలీజ్ కాకపోవడం, డైరెక్టర్లు, హీరోలు సినిమాలు నిదానంగా చేయడం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది అని అన్నారు.

Also Read : Pawan Kalyan : తన సినిమా అయినా రూల్ రూలే.. ‘హరిహర వీరమల్లు’తోనే కొత్త రూల్ మొదలు..

దీంతో బండ్లన్న వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. టాలీవుడ్ లో కూడా ఈ వ్యాఖ్యలపై చర్చ జరుగుతుంది. బండ్ల గణేష్ చెప్పింది కూడా నిజమే అంటున్నారు. ఇటీవల డిస్ట్రిబ్యూటర్లు నిర్వహించిన ప్రెస్ మీట్ లో కూడా పెద్ద హీరోలు సంవత్సరానికి రెండు సినిమాలు అయినా చేయాలని, వరుసగా పెద్ద సినిమాలు వస్తేనే థియేటర్స్ కి జనాలు వస్తారు, మాకు డబ్బులు వస్తాయి అని రిక్వెస్ట్ చేసారు. మరి హీరోలు, దర్శకులు ఇప్పటికైనా పాన్ ఇండియా మోజు తగ్గించుకొని మంచి కథలతో రెగ్యులర్ గా సినిమాలు చేస్తారా చూడాలి.

Also Read : Ghaati : అనుష్క ‘ఘాటీ’ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..