Pawan Kalyan : తన సినిమా అయినా రూల్ రూలే.. ‘హరిహర వీరమల్లు’తోనే కొత్త రూల్ మొదలు..
పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా జూన్ 12 రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి తెలిసిందే.

Pawan Kalyan HariHara VeeraMallu Movie Follow New Rule for Ticket Price Hike
Pawan Kalyan : ఇటీవల థియేటర్స్ ఇష్యూ పెద్దదయి ఏపీ ప్రభుత్వం వరకు వెళ్లి పవన్ కళ్యాణ్ సీరియస్ అవ్వడం జరిగిన సంగతి తెలిసిందే. పవన్ సినీ పరిశ్రమకు అన్ని విధాలుగా సపోర్ట్ ఇచ్చినా టాలీవుడ్ కొన్ని విషయాల్లో సీరియస్ తీసుకోవట్లేదని గమనించి పవన్ కొన్ని రూల్స్ తెచ్చారు. పవన్ వచ్చాక పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచాలని డైరెక్ట్ నిర్మాత, లేదా ఆ సినిమాకు చెందిన వ్యక్తి సినిమాటోగ్రఫీ మినిస్టర్ లేదా పవన్ వద్దకు వెళ్లి అడిగితే టాలీవుడ్ సపోర్ట్ గా ఓకే చెప్పేవారు.
ఈ థియేటర్స్ ఇష్యూ తర్వాత కొత్త సినిమాలు విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు నిమిత్తం నిర్మాతలు, వారికి సంబంధించిన వారు వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్నిసంప్రదించాలని, త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమాకు సైతం టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వానికి అర్జీ ఇచ్చి, సంప్రదింపులు చేయాలని, ఇందులో తనమన బేధాలు పాటించవద్దు అని పవన్ తెలిపారు.
Also Read : Ghaati : అనుష్క ‘ఘాటీ’ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..
పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా జూన్ 12 రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో పవన్ చెప్పినట్టు తన సినిమాకు కూడా ఈ కొత్త రూల్ ని ఫాలో అవుతున్నారు.
తాజాగా హరిహర వీరమల్లు సినిమా నిర్మాత ఏఎం రత్నం తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రసిడెంట్ భరత్ భూషణ్ ని కలిసి ఏపీలో హరిహర వీరమల్లు సినిమాకు టికెట్ రేట్ పెంపు, ప్రత్యేక షోలకు పర్మిషన్ ఇప్పించవలిసిందిగా కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. దీంతో తెలుగు ఫిలిం ఛాంబర్ ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం సినిమాటోగ్రఫీ శాఖను సంప్రదించనుంది. ఇక పవన్ పెట్టిన ఈ కొత్త రూల్ హరిహర వీరమల్లు సినిమాతోనే మొదలు అవుతుంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినా తన సినిమాకు కూడా రూల్ పాటించి పద్దతిగానే రావాలని చెప్పడం, నిర్మాతలు కూడా అలాగే చేయడంతో పవన్ ఫ్యాన్స్, నెటిజన్లు అభినందిస్తున్నారు.
Also Read : Comedian Ali : రాజేంద్రప్రసాద్ తనని బూతుపదంతో తిట్టడంపై అలీ స్పందన.. ఏమన్నారంటే?