Nanda : సదా ‘నంద’ ఫస్ట్ లుక్ విడుదల.. పుల్ స్పీడ్‌లో షూటింగ్
గోణుగుంట్ల విజయ్ కుమార్ సమర్పణలో సదా సినిమా, స్కై ఆర్ట్స్ పతాకాలపై సదా హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `నంద`.

Nanda First look
Nanda First look : గోణుగుంట్ల విజయ్ కుమార్ సమర్పణలో సదా సినిమా, స్కై ఆర్ట్స్ పతాకాలపై సదా హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘నంద’. ఈ సినిమాకు కళ్యాణ్ ఎర్రగుంట్ల నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

Nanda First look
Tillu Square : టిల్లు స్క్వేర్ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్.. బాయ్ ఫ్రెండ్ లేడంటే నిన్ను..
చిత్ర హీరో, దర్శకుడు సదా మాట్లాడుతూ.. తాను హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ‘నంద’ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నట్లు తెలిపారు. మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపుదిద్దుకుంటున్నట్లు చెప్పారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కిస్తున్నామని, ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా సినిమా షూటింగ్ జరుగుతోందన్నారు. చరణ్ అర్జున్ మా చిత్రానికి నాలుగు అద్భుతమైన పాటలు సమకూర్చారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

Nanda First look
MM Keeravaani : చంద్రముఖి-2కి ప్రాణం పోసేందుకు రెండు నెలలు నిద్రలేని రాత్రులు