Sagileti Katha : నవదీప్ సమర్పణలో ‘సగిలేటి కథ’.. ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్‌

రవితేజ మహాదాస్యం, విషిక కోట నూతన నటి నటులు జంట గా రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వంలో తెర‌కెక్కిన చిత్రం 'సగిలేటి కథ'.

Sagileti Katha : నవదీప్ సమర్పణలో ‘సగిలేటి కథ’.. ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్‌

Sagileti Katha

Updated On : July 22, 2023 / 9:15 PM IST

Sagileti Katha Trailer : రవితేజ మహాదాస్యం, విషిక కోట నూతన నటి నటులు జంట గా రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వంలో తెర‌కెక్కిన చిత్రం ‘సగిలేటి కథ’. హీరో నవదీప్ సి- స్పేస్ సమర్పణలో, అశోక్ ఆర్ట్స్, షేడ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది.

రాయలసీమ ప్రాంతం నేపథ్యంలో ఒక గ్రామం లోని పాత్రల మధ్య జరిగే నాటకీయ ఘటనల ఆధారంగా ఆయా పాత్రల మనస్తత్వాలకు అద్దం పడుతూ, అన్ని రకాల భావోద్వేగాలను నిజాయితీగా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేసారు. ఇది ఒక కాంటెంపరెర్రి విలేజ్ డ్రామ, పాత్రల చుట్టూ తిరిగే కథ. ఈ సినిమా చూసిన తర్వాత ఆ పాత్రలతో కొద్దిరోజులు మీరు పక్కా ట్రావెల్ చేస్తారు. ప్రతి పాత్ర చాలా సహజం గా ప్రత్యేక శైలి లో ఉండబోతుంది. ఇందులో చికెన్ కూడా ఒక పాత్ర.
Bro trailer launch event : మీ ప్రేమ కోస‌మే వ‌చ్చా.. ట్రైల‌ర్ శాంపిల్ మాత్ర‌మే.. సినిమాలో మ‌రెన్నో స‌ర్‌ప్రైజ్‌లు..

“చికెన్ అంటే కూరో, వేపుడో కాదు…చికెన్ అంటే ఒక ఎమోషన్ “. మలయాళం, తమిళ్ వంటి భాషలలో వాళ్ళ కల్చర్ అండ్ ట్రెడిషన్ ని సినిమా రూపంలో చాలా కథలు చెప్పి వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. ‘సగిలేటి కథ’ ద్వారా రాయలసీమ నేటివిటీ, కల్చర్ అండ్ ట్రెడిషన్ ని కథ రూపం లో వచ్చే ఆయా సన్నివేశాలు చూసి మన ఏపీ & తెలంగాణ లో మనమందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటాం.

గతంలో షేడ్ స్టూడియోస్ తమ షేడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ‘కనబడుటలేదు’ చిత్రాన్ని నిర్మించారు. ఎప్పుడు కొత్త వారికి అండగా ఉండే షేడ్ స్టూడియోస్ మరొకసారి నూతన నటి నటులు, సాంకేతిక బృందం తో కలిసి ఇప్పుడు రెండవ చిత్రం గా ఈ “సగిలేటి కథ” ను చక్కని విలేజ్ బ్యాక్డ్రాప్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు.

సగిలేటి కథ కేవలం సినిమా కాదు. మన జీవితంలో ఉండే అన్ని భావోద్వేగాలా సమర్పణ. ప్రతి ఒక్క పాత్ర మిమ్మల్ని అలరిస్తుంది. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ఈ సినిమా లో హీరో గా చేయడం చాలా అదృష్టం గా భావిస్తున్నాను.

Bro Trailer : బ్రో ట్రైల‌ర్ ఆగ‌యా.. మామా అల్లుడు కుమ్మేసారుగా..

ఈ చిత్రాన్ని చూసి, హీరో నవదీప్ ప్రేక్షకుల ముందుకి తన సమర్పణ లో తీసుకురావడం కొండంత బలం చేకూర్చిందని చిత్ర బృందం తెలిపింది. ఈ నెల 31 వ తారీకు ట్రైలర్ ని విడుదల చేయబోతున్నామని చిత్ర యూనిట్ పేర్కొన్నారు

ఈ చిత్రానికి రచయిత, సినిమాటోగ్రఫి, ఎడిటర్, దర్శకత్వం రాజశేఖర్ సుద్మూన్ అందించారు.