Bro Movie : వారాహి యాత్ర కాదు బ్రో యాత్ర షురూ.. ఆగష్టు నుంచి స్టార్ట్..

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ బ్రో మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో చిత్ర యూనిట్ ఇంతటి సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్యూ చెప్పేందుకు మూవీ టీం.. బ్రో విజయ యాత్ర మొదలు పెట్టబోతోంది.

Sai Dharam Tej and movie team starts Bro success tour

Bro Movie : ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan kalyan), సాయిధ‌ర‌మ్‌ తేజ్ (Sai Dharam Tej) కాంబినేషన్ లో వచ్చిన సోషియో ఫాంటసీ కామెడీ డ్రామా మూవీ ‘బ్రో’ (Bro). సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కేతిక శర్మ (Ketika Sharma), ప్రియా వారియర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా జులై 28న రిలీజ్ అయ్యి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. మొదటి మూడు రోజుల్లోనే ఈ మూవీ 100 కోట్ల పైగా కలెక్షన్స్ అందుకొని బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Dil Raju : పదవి చేపట్టడంతోనే సమస్యల పై దృష్టి పెట్టిన దిల్ రాజు.. తెలుగు సినీ పరిశ్రమ..!

దీంతో చిత్ర యూనిట్ ఫుల్ జోష్ లో ఉంది. ఇక ఇంతటి సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్యూ చెప్పేందుకు మూవీ టీం.. బ్రో విజయ యాత్ర మొదలు పెట్టబోతోంది. ఈ యాత్ర ఆగష్టు 1 నుంచి మొదలు కానుంది. మొదటిరోజు విజయవాడ, గుంటూరు, తెనాలి.. సిటీస్ లో మూవీ టీం సందడి చేయనున్నారు. ఆగష్టు 1వ తారీఖున ఉదయం 9 గంటలకు కనకదుర్గ టెంపుల్ ని దర్శించుకొని.. అక్కడి నుంచి తెనాలికి ముందుగా వెళ్లనున్నారు. ఆ తరువాత గుంటూరు, చివరిగా విజయవాడ థియేటర్ లో ఆడియన్స్ ని కలవబోతున్నారు. ప్రస్తుతం పవన్ తన వారాహి యాత్రకి గ్యాప్ ఇచ్చి OG షూట్ లో పాల్గొంటున్నాడు. ఈ గ్యాప్ లో ఈ బ్రో యాత్రని ఎంజాయ్ చేసేయండి.

OG Movie : మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్‌లో పవన్ కళ్యాణ్.. నెట్టింట పిక్స్ వైరల్..!

ఇక OG విషయానికి వస్తే.. ప్రస్తుతం నాలుగో షెడ్యూల్ జరుగుతుంది. మొన్నటి వరకు పవన్ లేకుండానే ఈ షెడ్యూల్ షూటింగ్ జరుగుతూ వచ్చింది. అయితే తాజాగా పవన్ కూడా ఈ మూవీ సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తుంది. మూవీ సెట్స్ నుంచి పవన్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటున్న కొన్ని ఫోటోలు బయటకి వచ్చాయి.